Thu Dec 19 2024 16:43:54 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
రెడ్ అలర్ట్.. ఇక చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!! పవనూ...ఆ వార్నింగ్‌లు ఏంటమ్మా, నెలరోజుల్లో అంత తాగేశారా..
పవనూ...ఆ వార్నింగ్‌లు ఏంటమ్మా
నీటి పంపకాల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ ప్రజలకు నష్టం జరగనివ్వబోమని అన్నారు. ఆయన నాయకత్వంలో నీళ్ల కోసం పోరాడుతున్నామని అంబటి రాంబాబు చెప్పారు. మన వాటాను మనం సాధించుకోవడం తప్పేంటని ఆయన ప్రశనించారు. కృష్ణా జలాల పంపకంలో ఏపీ తీవ్రంగా ఏపీ నష్టపోయిందన్నారు.తెలంగాణాలో చూసి ఇక్కడ నిర్ణయం.. చంద్రబాబు నయా ప్లాన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు మరికొద్ది రోజుల్లో తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి 52 రోజుల పాటు జైలులో ఉండి వచ్చిన చంద్రబాబు కంటికి చికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని విజయవాడకు వచ్చారు. రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నెలల నుంచి చంద్రబాబు కేసుల కారణంగా పార్టీలో ఒకరకమైన స్తబ్దత నెలకొంది.
కేసీఆర్ ఆ పని మాత్రం చేయకూడదు: వైఎస్ షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని.. ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ రావడం వల్ల కేసీఆర్ ను దించే అవకాశం ఆ పార్టీకి వచ్చినందువల్ల ఆ పార్టీకి తాము మద్దతుగా నిలిచామని.. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ... కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు.తన శపథం రేపటితో తీరిపోతుందని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గడ్డం రేపు తాను తీసేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. ఇండియా టుడే, ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని ఆయన అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర నీటి హక్కుల ముసుగులో స్వార్థ, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగర్‌పై దండయాత్ర చేశారని తేటతెల్లమైందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసులను జగన్ ఉసిగొలిపారని నరేంద్ర అన్నారు. డెల్టా రైతులు మొత్తుకున్నా సీఎం జగన్ నోరు మెదపలేదని, హఠాత్తుగా తెలంగాణ ఎన్నికల రోజు జగన్నాటకానికి తెరలేపారని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెడ్ అలర్ట్.. ఇక చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!!
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్ తుపాను దూసుకొస్తూ ఉండడంతో ఐఎండీ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది.భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నిపుణుల కోసం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఔత్సాహిక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ల కోసం, భారత ప్రభుత్వ రంగం అనేక కెరీర్ అవకాశాలను అందిస్తుంది. నైపుణ్యం కలిగిన IT నిపుణుల కోసం నానాటికీ పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. ప్రభుత్వ సంస్థలు CSE ఇంజనీర్లకు అవకాశాలు ఇవ్వాలని సిద్ధమయ్యాయి.
న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
సొంత గడ్డ మీద బంగ్లాదేశ్ మరోసారి రెచ్చిపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టును 150 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టును రెండో సారి ఓడించింది. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలోనూ బంగ్లాదేశ్ జట్టు కివీస్‌కు టెస్టుల్లో ఓటమి రుచి చూపించింది. సిల్హట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌట్ అయింది. కేన్ విలియమ్సన్ సెంచరీ (104)తో రాణించినా..తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం తెరిచి ఉంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
నెలరోజుల్లో అంత తాగేశారా.. ఫ్రీగా వస్తుంటే... కోట్లాది రూపాయల విలువైన
తెలంగాణ ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. కేవలం ఇరవై రోజుల్లోనే కోట్లాది రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. నవంబరు నెలలో జరిగిన మద్యం అమ్మకాలను చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. దాదాపు 1470 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. నవంబరు 30వ తేదీన తెలంగాణ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు ఇరవై రోజులు జనం విపరీతంగా తాగేసినట్లు లెక్కలు చెబుతున్నాయిNext Story