Thu Dec 19 2024 19:05:45 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఆరోగ్యం బాగాలేకపోతే.. విజయయాత్ర ఎలా చేస్తారా? చంద్రబాబు బెయిల్పై సజ్జల
చంద్రబాబుకు బెయిల్ వస్తే ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజలకు ఒకవర్గం మీడియా తప్పుడు సమాచారం ఇస్తుందని అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరగలేదని నిరూపించుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వీళ్ల బలుపు చూశారా? గెలిచినంత మాత్రాన ఇలా చేయాలా?
వరల్డ్ కప్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసిస్ ఆటగాళ్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించి కప్పును సొంతం చేసుకున్నారు. ఆరోసారి తమ దేశానికి వరల్డ్ కప్ ను అందించారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ఆటలో ఎవరు ఎక్కువ పనితీరు కనపరిస్తే వారినే విజయం వరిస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా అంతే. తమ సొంత మైదానం కాకపోయినా.. స్టేడియం మొత్తం భారత్ కు మద్దతు తెలుపుతున్నా తాము ఆట మీద దృష్టి పెట్టి విక్టరీని సాధించారు.చంద్రబాబుకు బెయిల్ మంజూరు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో తీర్పు వచ్చింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ వేసుకున్న పిటీషన్ పై హైకోర్టు విచారణ పూర్తి కొద్ది రోజుల క్రితం పూర్తి చేసింది. ఇరువర్గాల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపంచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.బీజేపీలో ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు? అసలు కారణం అదేనంటున్నారుగా
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని అన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ అగ్ర నేతల నుంచి దిగువ స్థాయి నేతల వరకూ ఈసారి అధికారం తమదేనంటున్నారు. ఈ ఈక్వేషన్లు ఎక్కడా కలవడం లేదు. నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లి పోతున్నారు. కొత్త నేతలు వచ్చి చేరడం లేదు. అయినా గెలిచేది మేమేనన్న ధీమాలో కమలదళం ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.కోహ్లీ, రాహుల్ భార్యలపై హర్భజన్ వైరల్ కామెంట్స్..
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరు హోరాహోరీగా ముగిసింది. ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ తలపడ్డాయి. 2003 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్, ఆస్ట్రేలియా తలపడగా.. అప్పుడు ఆస్ట్రేలియా ట్రోఫీని సాధించింది. దీంతో ఈసారి భారత్, ఆస్ట్రేలియా పై విజయం సాధించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఆశించారు. కానీ ఆ ఆశలు నిరాశగా మారాయి. ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ ఓటమిని ఎదుర్కొంది.ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త.. హెచ్చరించిన కేసీఆర్
యాభై ఏళ్ల పాలనలో గోస తప్ప అభివృద్ధి లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు, కరెంటు కూడా ఇవ్వలేకపోయారన్నారు. గత పథ్నాలుగేళ్లు ఉద్యమం, పదేళ్ల పాలనలో ఏం జరిగిందో చూడాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైంలో నల్లగొండ ఎలా ఉండేదో చూడాలన్నారు.విశాఖలో భారీ అగ్ని ప్రమాదం...ఆస్తి నష్టం ఎంతంటే?
విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక బోటులో సంభవించిన ప్రమాదంతో ఇతర బోట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అనేక బోట్లు ఈ ప్రమాదంలో అగ్ని కీలలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నలభై బోట్లకు పైగానే మంటలకు ఆహుతయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.తెలంగాణలో మొదలయిన పోలింగ్
ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే వాస్తవానికి తెలంగాణలో పోలింగ్ మాత్రం ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానుంది. కానీ నిన్నటి నుంచే ఇంటి వద్దకే వెళ్లి ఎన్నికల అధికారులు ఓటింగ్ హక్కును ఉపయోగించుకునేలా చేస్తున్నారు. ఇప్పుడు కేటాయించిన తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకోని వాళ్లు డిసెంబరు 26వ తేదీన వినియోగించుకునే వీలుంది.విశాఖ బాధితులకు ఎనభై శాతం పరిహారం... జగన్ ఆదేశం
వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ హార్బర్ ఘటనలో నష్టపోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న విశాఖ హార్బర్ వద్ద అగ్నిప్రమాదం జరిగి దాదాపు నలభై బోట్లు వరకూ అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.లియో ఓటీటీ రిలీజ్ డేట్.. ఎప్పుడు..? ఎక్కడ..?
తమిళ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ 'లియో'. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, సంజయ్ దత్, త్రిష.. వంటి స్టార్ క్యాస్ట్ నటించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అనుకునంత స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. అయినా కలెక్షన్స్ విషయంలో మాత్రం యమా దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్ళింది.Next Story