Fri Dec 27 2024 16:05:01 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పోలింగ్ ముగిసింది... అంతా ప్రశాంతమే, బన్నీతో కలిసి ఇన్‌స్టా రీల్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?ఆ వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు
(Note: Please click the headline to read the complete article)
Telangana Elections Polling : పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ అత్యధికంగానే నమోదయింది. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ పోలింగ్ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ జరుగుతుంది. పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా అన్ని పార్టీలూ ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటుంటాయి. అందుకే పోలింగ్ శాతం పెరగడంపై కూడా అంచనాలు అనేకం వస్తుంటాయి.
Hi Nanna : విజయ్-రష్మిక ఫోటోని మరింత చీప్‌గా వాడుకుంటారా.. నానిపై ఫ్యాన్స్ ఫైర్..
చురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా 'హాయ్ నాన్న' రిలీజ్ కి సిద్దమవుతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా శృతిహాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని నాని అండ్ హాయ్ నాన్న టీం ఓ రేంజ్ లో చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డే అన్నది అందరికి తెలిసిందే. ఇక ఒక పౌరుడిగా తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ దగ్గరకి చేరుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పోలింగ్ బూత్స్ వద్దకి వచ్చి, సాధారణ ప్రజలతో పాటు క్యూ లైన్లో నిలబడి వెళ్లి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే తమ ఓటుని వేయడానికి వచ్చిన చిరంజీవి, ఎన్టీఆర్, బ్రహ్మానందం సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికలు జరిగే రోజు నాగార్జున సాగర్ జలాల వివాదం రేకెత్తడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈరోజు వరకూ లేని సమస్య పోలింగ్ కు ముందు అర్ధరాత్రి ఎందుకు జరిగిందన్న ప్రశ్న తలెత్తుతుంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య నీటి పంపకాల కోసం ఇరువురూ పట్టుబడుతున్నారు. రెండు ప్రభుత్వాలు ఇప్పటి వరకూ కూర్చుని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయలేదు.
తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. అయితే క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే వారికి అనుమతిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగింది. అయితే కొన్ని చోట్ల ఇంకా క్యూ లైన్ లలో అనేక చోట్ల ఓటర్లు వేచి ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనూ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ ఓటర్లు బారులు తీరి ఉన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరిలో తానే ముందు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి 23 మిలియన్ పైగా ఫాలోవర్స్ తో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కంటే టాప్ లో నిలిచారు. ఇక ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న తరువాత ఇన్స్టాగ్రామ్ సంస్థ నుంచి ఒక టీం వచ్చి.. బన్నీ పై ప్రత్యేక వీడియో కూడా చేశారు.
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 మొదలయ్యి.. ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 13వ వారంలోకి అడుగుపెట్టిన ఈ సీజన్ మరో రెండు వారాల్లో ఫినాలే జరుపుకోనుంది. ఇక ఫినాలే టైటిల్ గెలుచుకోవడం కోసం, ఆడియన్స్ నుంచి ఓట్లు పొందే కోసం ప్రతి కంటెస్టెంట్ పోటాపోటీగా టాస్క్ లు అడుగుతున్నారు. ఇది ఇలా ఉంటే, నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
కొడంగల్ లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు ను వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటేస్తేనే బలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ ఎన్నికల అధికారి సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కోరారు.
Telangana Elections : యువత పోలింగ్ కు దూరం.. కానీ ఆక్సిజెన్ సిలిండర్ తో వచ్చి మరీ శేషయ్య
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. అయితే హైదరాబాద్ లో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ఉత్సాహం చూపడం లేదు. ఓటు విలువ ఎంత తెలియజెప్పినప్పటికీ వారికి మొబైల్స్‌తో గడపడమే ఎక్కువగా ఇష్టం ఉన్నట్లు కనపడుతుంది. మొబైల్ ను వదిలి పోలింగ్ కేంద్రానికి వచ్చేందుకు వారు ఇష్టపడటం లేదు.Telangana Elections : ఈవీఎంల మొరాయింపు.. వేచి చూస్తున్న సెలబ్రిటీలు
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. హైదరాబాద్ లో మాత్రం కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రాంతంలో సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.Next Story