Sun Nov 17 2024 18:40:00 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Rain Alert : తెలంగాణలో వాతావరణ మార్పు... వర్షాలు కూడా
తెలంగాణలో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ద్రోణి ఫలితంగా ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉదయం వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.కమ్మ సామాజికవర్గానికి కాపు అసోసియేషన్ వార్నింగ్.. ఇక్కడ తమకు మద్దతివ్వకుంటే?
తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. దీంతో ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి ఓట్లు ఎటువైపు పడతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు పడతాయని ఆ పార్టీ భావిస్తుండగా, తమకే ఎక్కువ మంది ఏపీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయని కాంగ్రెస్ అంచనా వేసుకుంటే, దానికి, ఇక్కడ సమస్యలకు సంబంధం లేదని, బీఆర్ఎస్ వంటి సుస్థిర ప్రభుత్వానే ఏపీకి చెందిన అత్యధిక ఓటర్లు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.Visakha : రోడ్డు ప్రమాదం.. ఆటోను లారీ ఢీకొట్టడంతో
విశాఖపట్నంలో స్కూలుకు వెళుతున్న విద్యార్థుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖనగరంలోని ఎంవీపీ కాలనీలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర పారిపోయే ప్రయత్నం చేశారు.Harish Rao : నిర్మలమ్మకు హరీశ్ స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోటార్లకు మీటర్లు బిగించనందునే తాము నిధులు ఇవ్వలేదన్న సీతారామన్ వ్యాఖ్యలు సత్యమని అన్నారు. అందుకోసమే తెలంగాణకు నిధులు నిలిపేసిందని కూడా ఆయన తెలిపారు. సిద్ధిపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం వత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నారు.Divya Vani : కాంగ్రెస్ లో చేరిన దివ్యవాణి.. ఆ పార్టీలోకే ఎందుకంటే?
సినీనటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె అన్నారు. దివ్యవాణి తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ థాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెను థాక్రే కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి దివ్యవాణి సేవలను ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా థాక్రే తెలిపారు.తమిళ నటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. బాలకృష్ణ గురించేనా.?
క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక వీడని భూతంలా ఇంకా చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ టు బాలీవుడ్ దీనికి సంబంధించిన ఏదొక విషయం బయట పడుతూనే ఉంటుంది. అయితే తమిళ్ ఇండస్ట్రీలో దీని గురించి ఎక్కువ వినిపిస్తుంటుంది. సూచి లీక్స్, మీటూ, అలాగే సందర్భం దొరికినప్పుడల్లా అక్కడ దిగ్గజ రచయిత పై సింగర్ చిన్మయి చేసే ఆరోపణలు..భారత్ క్రికెట్ ఆటగాళ్లు పై వెంకీ మామ కామెంట్స్ వైరల్..
Venkatesh : ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడం అందర్నీ చాలా బాధకి గురి చేసింది. ఫస్ట్ నుంచి అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ ఫైనల్ కి చేరిన భారత జట్టు.. తుదిపోరులో కూడా విజయం సాధిస్తారని ఆశించారంతా. కానీ ఆ ఒక్క మ్యాచ్ అందరి ఆశలు పై నీళ్లు పోసింది. కోట్లమంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యేలా చేసింది. ఇక సినిమాతో పాటు క్రికెట్ ని కూడా అమితంగా ప్రేమించే మన వెంకీ మామ కూడా ఓడిపోయినందుకు చాలా బాధ పడ్డారు.24న జగన్ బెయిల్ రద్దుపై విచారణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ పదేళ్ల నుంచి బెయిల్ పై ఉంటున్నారని, కేసుల విచారణ వేగవంతంగా జరగడం లేదని ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.26న మోదీ తిరుమల పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన తిరుమలకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం నుంచి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రానున్నారు. ఈ మేరకు ప్రధాని తిరుమల షెడ్యూల్ విడుదలయింది. 26వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుమలకు చేరుకుంటారు. 26వ తేదీ రాత్రి తిరుమలలోనే ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్నారు. 27వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు.రేపు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్
రేపు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు విశాఖ వేదిక కానుంది. వరల్డ్ కప్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ 20 సిరీస్ జరుగుతుండటం అభిమానులకు పండగే. మొత్తం ఐదు టీ 20 మ్యాచ్ లు భారత్ లో జరగనున్నాయి. రాత్రి ఏడు గంటలకు విశాఖలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. రెండు జట్లు ఈ సిరీస్ ను తమ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.Next Story