Thu Dec 19 2024 19:06:46 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి Naa Anveshana Youtuber -"అన్వేష్" సంచలన ఆరోపణలు..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే తెలంగాణ ప్రజలకు సైతం తమ రాష్ట్ర ఎన్నికలకంటే ఆంధ్రా ఎన్నికల పై ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి ఏం జరుగుతుంది..? అక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారు..? అని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలు అంత ఎంటర్టైన్మెంట్ గా మారాయి.బీఆర్ఎస్ను తిట్టకపోవడానికి కారణం చెప్పిన పవన్
బీఆర్ఎస్ పై తాను విమర్శించకపోవడానికి కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ను విమర్శించకపోవడానికి తాను ఎక్కువగా తెలంగాణలో పర్యటించలేదని ఆయన అన్నారు. ఇక్కడ పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. తనకు అన్ని పార్టీల్లో స్నేహితులు ఉన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావుతో తనకు మంచి పరిచయాలున్నాయని, అయితే స్నేహం వేరు రాజకీయం వేరు అని పవన్ కల్యాణ్ అన్నారు.మేఘా సంస్థదే పూర్తి బాధ్యత
టీడీపీ దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమేనని, తమ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు అని ఆయన తెలిపారు.ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వెబ్‌సిరీస్‌ల వెంటే.. కాలం మారింది మామా
కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలకు మాస్క్ ఎలా అలవాటు అయ్యిందో.. వెబ్ సిరీస్ కూడా అలాగే అలవాటు అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటిలోనే కూర్చున్న ప్రజలంతా.. ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్ చూసి వాటికీ ఆకర్షితులు అయ్యారు. ఇక ఆడియన్స్ కి వెబ్ సిరీస్ పై పెరిగిన ఇంటరెస్ట్ ని గమనించిన ఇండియన్ మేకర్స్.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఐదురోజులు మాత్రమే గడువు ఉండటంతో అన్ని పార్టీలూ స్పీడ్ ను పెంచాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. మల్లికార్జున ఖర్గే నుంచి రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు.
నవ్వితే చాలదు.. పరువు పోకముందే ఇకనైనా సస్పెండ్ చేయి సామీ
వైఎస్ జగన్ ఎందుకు నానుస్తున్నారో అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం లేదు. అయినా ఆయన తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు విషయంలో మౌనంగా ఉండటం పార్టీ నేతలకు కాదు కదా సామాన్యకార్యకర్తలకు కూడా రుచించడం లేదు. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి భయపడుతున్నారన్న ప్రశ్న కింది క్యాడర్ నుంచి వినపడుతుంది. రఘురామ కృష్ణరాజుపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడాన్ని పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా పై ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కల చెదిరింది. అప్పటి దాకా వరస విజయాలతో ఫైనల్స్ లోకి దూసుకు వచ్చిన టీం ఇండియా ఇలా ఫైనల్స్ లో ఓడిపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి బ్యాటర్లు, బౌలర్లు విఫలమవ్వడం కూడా ఒక రీజన్. ఆటలో ఎవరైనా గెలవచ్చు. ఆస్ట్రేలియా ఆరోజు బాగా ఆడింది. భారత్ బాగా ఆడినా ముందుగా బ్యాటింగ్ చేసి అనుకున్న పరుగులు చేయలేకపోయింది. అప్పటి వరకూ అందరూ ఫామ్ లో ఉన్నవారే.
"స్కై" చేతిలో యంగ్ ఇండియా.. ఏం చేస్తారోనన్న టెన్షన్లో ఫ్యాన్స్
మరికాసేపట్లో ఇండియా - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. కానీ వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చేతికి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఫైనల్స్ లో కూడా సూర్య విఫలం కావడంతో ఆయనపై ఫ్యాన్స్ ఆశలు పెద్దగా లేవు. సూర్యకుమార్ ను కెప్టెన్ గా చేయడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు.బలమెంతో.. బలహీనతలు అన్నే... హ్యాట్రిక్ విక్టరీకి అవకాశాలు.. అడ్డంకులేంటి?
తెలంగాణలో సాధారణ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్డర పడుతుంది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలయింది. గెలుపోటములపై ఇప్పటికే తెలంగాణ మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్కంఠ నెలకొంది. భారీ ఎత్తున బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఈసారి వేవ్ కాంగ్రెస్ వైపు ఉందని కొందరు అంటుంటే.. అధికార పార్టీ బీఆర్ఎస్ మరొకసారి అధికారంలోకి రాగలదన్న నమ్మకంతో మరికొందరు ఉన్నారు. హ్యాట్రిక్ విజయం ఖాయమని నమ్ముతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తమదే అధికారం అన్న ధీమాలో ఉంది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో పదోన్నతులకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్దతకు తెరపడింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తమకు పదోన్నతులు కల్పించడం లేదన్న విమర్శలకు జగన్ సర్కార్ చెక్ పెట్టింది. దీనికి సంబంధించిన అర్హతలు, నిబంధనలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story