Thu Dec 19 2024 19:20:28 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
Revanth Reddy : ఆ పన్నెండు మందిని అసెంబ్లీ గేటు తాకనివ్వకండి
పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు మీ తీర్పు గుణపాఠం కావాలని కోరారు. నకిరేకల్ సభలో ఆయన మాట్లాడారు. ఇసుక మీద ఎవరైనా మేడిగడ్డ బ్యారేజీ కడతారా? అని ప్రశ్నించారు. మందేసి కట్టాడా? మతిలేక కట్టాడా? అని రేవంత్ ఫైర్ అయ్యారు. నాడు ఈ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ ద్వారా నీళ్లు ఇవ్వాలని నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాడి నీళ్లు తెచ్చారన్నారు.YouTuber Anvesh : ఏపీ రాజకీయాలు ఇప్పుడు అన్వేష్ చుట్టూ తిరుగుతున్నాయా?
ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. వివిధ ప్రాంతాలను తిరుగుతూ ఎలా వెళ్ళాడు.. ఎక్కడి నుండి వెళ్ళాడు.. ఏమి చేశాడు లాంటి ఎన్నో విషయాలను తన వీడియోల ద్వారా వివరిస్తూ వస్తుంటాడు. ఎవర్రా మీరంతా అంటూ సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటాడు. అయితే అన్వేష్ ఉచితాల ద్వారా జింబాబ్వే దేశం ఎలా నాశనం అయిందో అని వివరించడానికి ప్రత్యేకంగా ఓ వీడియోను చేశాడు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలు చాలా ప్రమాదకరమని..Vijay - Rashmika : అన్‌స్టాపబుల్ షోలో విజయ్, రష్మిక లవ్‌స్టోరీపై క్లారిటీ..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్న బంధం ఏంటనేది..? ఒక మిలియన్ డాలర్ ప్రశ్నలా మారిపోయింది. వారిద్దరూ కేవలం స్నేహితులా..? లేక ప్రేమకులా..? అనే దానిపై ఒక క్లారిటీ లేక అభిమానులు కూడా తికమక పడుతున్నారు. విజయ్ అండ్ రష్మిక తమ రిలేషన్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అనే చెప్పుకొస్తున్నప్పటికీ.. నెటిజెన్స్ మాత్రం వారిద్దరూ ప్రేమికులు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఆధారాలు చూపిస్తూ వైరల్ చేస్తుంటారు.Big Alert : ఆ యాప్ వాడుతున్నారా ఇక అంతే సంగతులు !!
తక్కువ సమయంలోనే అవసరానికి తగ్గ డబ్బులు దొరుకుతాయని మనం యాప్స్ లో నుండి డబ్బులు తీసేసుకుంటూ ఉంటాం. అయితే మనం ఏ యాప్స్ లో నుండి తీసుకుంటున్నామో కూడా కాస్త దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన విషయమే..! ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనం డబ్బులు చెల్లించకపోతే ఊహించని విధంగా టార్చర్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఎంతో మంది యాప్స్ లో లోన్స్ ను తీసుకుని కట్టకపోయేసరికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.New SIM: మీరు కొత్త సిమ్ తీసుకుంటున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
ప్రతి నెల రాగానే ఒకటో తేదీ నుంచి కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. వినియోగదారులు ఎలాంటి రూల్స్ ఉన్నాయో ముందుస్తుగా తెలుసుకోవడం ముఖ్యం. లేకుంటే ఇబ్బందులతో పాటు ఆర్థిక నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సిమ్ కార్డు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. మీరు కొత్త సిమ్ కొనాలని ప్లాన్ చేసినా లేదా సిమ్ కార్డ్ కొన్నా.. ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.Covid-19: కోవిడ్ వాక్సిన్ వేస్కున్నారా? ఐతే ఈ గుడ్ న్యూస్ మీకే..
గతంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఎంతో మంది బలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్లో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కరోనా సోకి చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పటికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేశాయి.గత కొన్నిరోజులుగా తమిళ ఇండస్ట్రీలో.. త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదంగా సంచలనంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ.. లియో సినిమాలో త్రిషని రేప్ చేసే సీన్ తనకి రానందుకు చాలా ఫీల్ అయ్యాను అంటూ చేసిన వ్యాఖ్యలో వివాదానికి దారి తీశాయి. ఇక ఈ కామెంట్స్ పై త్రిష సీరియస్ అవ్వడం ఆమెకు సపోర్ట్ గా టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో విషయం బాగా సీరియస్ అయ్యింది.
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం ప్రధాని మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారన్నారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులని అంటున్నారని..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఇలాగేనా?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు పలు రకాలుగా ఉన్నాయి. ఒక్కో పార్టీదీ ఒక్కో అంచనా. ఆత్మవిశ్వాసం కావచ్చు. తమను ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందని నమ్మకం కావచ్చు. ఈసారి అధికారం తమదేనని ప్రతి పార్టీ అంటోంది. భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని చెబుతుంది. ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి నేతల వరకూ ఈసారి తెలంగాణలో అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.Barrelakka : టెన్షన్ పెడుతున్న బర్రెలక్క... బతిమాలలేరు... బెదిరించనూ లేరు
తెలంగాణలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తుండటం అందుకు కారణం. చైతన్యవంతమైన రాష్ట్రం కావడంతో పార్టీకన్నా, గుర్తుల కన్నా, వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో గత ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించారు. అంతే కాదు 119 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు పోలయిన ఓట్ల శాతాన్ని చూసి ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.Next Story