Thu Dec 19 2024 16:44:33 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
డబ్బులు ఎంతిచ్చినా తీసుకోండి.. మిగతా డబ్బులు మేం ఇస్తాం,పెద్దాయన పంథాలోనే ఈయన కూడా...అసలు కారణమదేనట,ఫైనల్ కు వాడిన పిచ్ అన్ ఫిట్: తేల్చేసిన రాయుడు ఇంకా మరెన్నో వార్తలు
ఫైనల్ కు వాడిన పిచ్ అన్ ఫిట్: తేల్చేసిన రాయుడు
ఐసిసి ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ఆడిన తీరుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. వరుసగా 10 గేమ్‌లు గెలిచిన తర్వాత ఫైనల్ లో ఓడిపోవడంతో టోర్నమెంట్ ను ముగించడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు. మెగా గేమ్‌కు సిద్ధం చేసిన వికెట్‌ను కూడా రాయుడు ప్రశ్నించాడు. “పిచ్ నెమ్మదిగా ఉంది. అలాంటి ట్రాక్‌లో ఫైనల్ ఆడరు.సౌమ్య విశ్వనాథన్ ను చంపిన వారికి పడిన శిక్ష ఇదే!!
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య జరిగిన దాదాపు 15 ఏళ్ల తర్వాత నలుగురు దోషులకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐదో దోషికి ఇప్పటికే జైలు శిక్ష పడింది. నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్, అజయ్ కుమార్‌లకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఒక్కొక్కరికి రూ.25,000 అలాగే మరో లక్ష జరిమానా విధించారు. ఐదో దోషి అజయ్ సేథీకి రూ.7.5 లక్షల జరిమానా విధించింది.హెచ్చరిక.. అలా ట్రేడింగ్ చేయకూడదు
అనధికారికంగా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు లేకుండా ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న సంస్థల జాబితాలో మరో 19 సంస్థల పేర్లను ఆర్బీఐ చేర్చింది. ఆయా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంస్థల పేర్లతో అలర్ట్ లిస్ట్ విడుదల చేసింది.ఆయన్ను ఓడించడానికి.. 300 కోట్లు
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరులో తనను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారని పొంగులేటి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు విచ్ఛిన్నమయ్యాయని.. పదేళ్ల కాలంలో దోచుకున్న లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. తనను ఓడించేందుకు స్థానిక ఎమ్మెల్యేకు రూ. 300 కోట్లు పంపించారని చెప్పారు.ఆయనకు అన్యాయం.. ఇక్కడేమో సోనియా గాంధీ దయ
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు పడుతున్న సమయంలో పలు పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి చేరుకున్నారు. ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దివంగత పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని ప్రియాంకగాంధీ చెప్పారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ... పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం గురించి ప్రియాంక గాంధీకి తెలియకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు.BJP : ఒకే రోజు అందరూ దిగారు....తెలంగాణలో పోగేసి పాగా వేయాలని
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సమయం గడువు ముగియనుండటంతో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో సుడిగాలిలో పర్యటనలు చేస్తున్నారు. అగ్రనేతలందరూ చుట్టుముట్టి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ చుట్టేస్తున్నారు. ప్రచార సభలో హోరెత్తిస్తున్నారు. ఒకసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ తో పాటు అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.Narendra Modi : సత్తా చూపుతాం.. గెలిచి తీరుతాం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించిందని, రానున్న ఎన్నికల్లోనూ అదే విజయాన్ని దక్కించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ రెండేనని ఆయన అన్నారు. రెండూ అవినీతి పార్టీలేనని అన్నారు. తెలంగాణలో రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతిభావంతులని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ కలసి పనిచేస్తున్నాయని అన్నారు. అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.Ys Jagan : పెద్దాయన పంథాలోనే ఈయన కూడా...అసలు కారణమదేనట
సహజంగా ఒక రాజకీయ నేత చేసిన పని నిజమనిపిస్తే మరొక నేత కూడా దానినే ఫాలో అవుతారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. ఒకరిని చూసి మరొకరు అదే పంథాలో వెళుతుంటారు. ఒకచోట సక్సెస్ అయితే అదే ఫార్ములాను తాము అందిపుచ్చుకుని వెళతారు. రాజకీయాల్లో ఇది మామూలు విషయమే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.Revanth Reddy : డబ్బులు ఎంతిచ్చినా తీసుకోండి.. మిగతా డబ్బులు మేం ఇస్తాం
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువైందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. రైతుబంధు కు ఈసీ అనుమతి ఇవ్వడం చూస్తే అర్థం చేసుకోవాలని కోరారు. రైతుబంధు డబ్బులు పడ్డాయని ప్రభావితం కావొద్దని రైతులుకు రేవంత్ విజ్ఞప్తి చేశారు తాము అధికారంలోకి వవచ్చిన వెంటనే ఐదు వేలు ఎక్కువ ఇస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఏ పథకం కింద డబ్బులు వేసినా తీసుకోవాలని, ఎంత ఇచ్చినా తీసుకుంటే మిగిలినవి కాంగ్రెస్ ఇస్తుందన్నారు.Priyanka Gandhi : తల్లి మాటలను గుర్తు చేసుకుని... ఆ విషయాన్ని పంచుకున్న ప్రియాంక
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈరోజు మధిర సభలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాత్రి తల్లి సోనియా గాంధీ ఫోన్ చేశారన్నారు. తెలంగాణలో ప్రచారం చేస్తున్నావు కదా? ఏం మాట్లాడతావు అని తనను ప్రశ్నించారన్నారు. తాను అందుకు సత్యమే చెబుతానని చెప్పాననడంతో సభ మొత్తం చప్పట్లతో మారు మోగింది.Next Story