Sun Nov 17 2024 22:36:49 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
భారీగా పట్టుబడుతున్న డబ్బు, మద్యం, నగలు.. ఎంతో తెలిస్తే..
తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగిపోతుంటే.. మరో వైపు భారీ ఎత్తున డబ్బు,మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడికక్కడ భారీగా నగదు,మద్యం పట్టుబడుతున్నాయి. ఆధారాలు చూపని వాటిని పోలీసుల సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.TDP : టీడీపీని చూస్తే జాలేస్తుంది... చంద్రబాబు సీటుకే ఎసరా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నికల వేడి అందుకుంది. యాత్రలు మొదలయ్యాయి. ప్రతి పార్టీ ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి అని తేలిపోయింది. సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని రెండు పార్టీల ప్రయత్నంగా తెలుస్తోంది.Congress : 40 మందికి ఓకే.. మిగిలిన వాటిలోనే
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నేడు మరోసారి జరగనుంది. రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తుంది. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకూ నలభై మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే మిగిలిన స్థానాలపై కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నేడు కసరత్తులు చేేయనుంది.Revanth Reddy : అంజనీకుమార్, స్టీఫెన్ రవీంద్రలను బదిలీ చేయాల్సిందే
కాంగ్రెస్ పార్టీ తరుపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ కు మద్దతిస్తున్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ
ఒక వైపు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎన్నికల మోడ్‌లో ఉన్నాయి. వివిధ పార్టీల నేతలు టికెట్ల కోసం ఆశిస్తుంటే మరి కొందరేమో పార్టీ మార్పులపై దృష్టి పెడుతున్నారు. టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పార్టీ మారుతున్నట్లు పుకార్లు షికార్లు అవుతున్నాయి.Chandrababu : బెయిల్ పై హౌస్ మోషన్ పిటీషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని పిటీషన లో కోరారు. చంద్రబాబు కంటికి అత్యవరంగా చికిత్స చేయాలని, అందుకు అనుమతించాలని ఆయన కోరారు.ఆ ఇద్దరిలో ఉన్నది... పవన్‌లో లేనిది..!
పవన్ కళ్యాణ్ చాలామంది యువతకు ఆరాధ్య దైవం. గోపాలా గోపాలా, బ్రో సినిమాల్లో దేవునిలా కనిపించినా... వీరాభిమానులు మాత్రం ఆయన్ను దేవునిలాగే చూస్తారు. పవన్ గొప్ప నటుడు కాకపోవచ్చు కానీ, మంచి ఎంటర్టైనర్. తనవైన టిపికల్ మ్యానరిజమ్స్‌తో యువత మనసుల్ని కొల్లగొడతాడు.4-7-8 గురించి మీకు తెలుసా!
ఆధునిక యుగంలో స్ట్రెస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాల్లో వత్తిడి తప్పడం లేదు. శారీరక వ్యాయామాలు ఎన్ని చేసినా, స్ట్రెస్‌ను జయించడం కష్టమవుతోంది. ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేద్దామన్నా కొందరికి టైం కుదరడం లేదు. దీనికోసం ఓ పాశ్చాత్య వైద్యుడు 4-7-8 టెక్నిక్‌ను సూచిస్తున్నాడు.వెంకటేష్ కూతురి ఎంగేజ్మెంట్లో చిరు, మహేష్.. ఫోటోలు చూశారా..
టాలీవుడ్ ఫ్యామిలీస్ లో వరుసగా పెళ్లి భజంత్రీలు మోగుతూ వస్తున్నాయి. తాజాగా దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి మొదలయింది. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ నిన్న అక్టోబర్ 25న హైదరాబాద్ లోని ఒక హోటల్ లో చాలా సింపుల్ గా జరిగిపోయింది.World Cup 2023 : ఎందుకు దూరం పెట్టారో.. ఆల్ రౌండర్ అనిపించ లేదా?
వరల్డ్ కప్ లో భారత్ కు వరస విజయాలు అందుతున్నాయి. అంత వరకూ బాగానే ఉంది. హార్ధిక్ పాండ్యా ప్లేస్‌ను భర్తీ చేసెదెవరు? క్రికెట్ చూసేవారెవరికైనా వెంటనే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్షర పటేల్. ఆల్ రౌండర్‌గా భారత్ ను అనేకసార్లు విజయ తీరాలకు చేర్చిన ఘనత అక్షర్ పటేల్ ది.Next Story