Fri Dec 20 2024 08:06:26 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పరిస్థితి క్రిటికల్.. స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం?
దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి గాలి పీల్చుకోవాలంటేనే తెగ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడి గాలి పీల్చిన ఎంతో మంది జనాలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇది ఎక్కడ కాదు.. ఢిల్లీ నగరంలో.ఢిల్లీ వాయు నాణ్యత సూచీ నిన్న 309కి చేరుకుంది.ఇటలీలో జరిగే వరుణ్-లావణ్య పెళ్ళికి.. పవన్ కళ్యాణ్ వెళ్తాడా..?
టాలీవుడ్ ఆన్ స్క్రీన్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరో వారం రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట.. నవంబర్ 1న ఏడడుగులు వేయబోతున్నారని సమాచారం.తెలంగాణలోని 8 జిల్లాలకు మావోయిస్టుల ముప్పు
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు భారీ ఎత్తున తెలంగాణకు వచ్చి చేరుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బలగాలను రంగంలోకి దింపింది కేంద్రం. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణలోని 8 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 614 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 68 ఏళ్ల వయసున్న్ లీ కెకియాంగ్ మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. జీ జిన్ పింగ్ కు ముందు ఆయన అనేక సంస్కరణలను తెచ్చి లీ కెకియాంగ్ చైనాలో గుర్తింపు తెచ్చుకున్నారు. పదేళ్ల పాటు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు.
ధర్మపురి అరవింద్ గత పార్లమెంటు ఎన్నికల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన మాజీ పీసీపీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.
మద్యం: ప్రభుత్వానికి ఆదాయం
ప్రభుత్వాలకు ఆదాయం చాల చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు భూమి శిస్తు ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు క్రమంగా ఇటువంటి ఆదాయానికి దూరం అయ్యాయి. ఆధునిక భారతంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ఆదాయం మీద ఆధారపడుతున్నాయి. ప్రజలను పీడించి, పిండి వసూలు చేసే పన్నులలో మద్యం మీద పన్ను కూడా ఉంటుంది.TDP : పొత్తు ఖరారయింది.. సీట్లు కూడా దాదాపుగా ఫైనల్ అయినట్లేనట
జనసేన, టీడీపీ పొత్తు ఖరారయింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఖరారయింది. రెండు పార్టీల క్యాడర్ కలసి పోరాటం చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు రాష్ట్ర స్థాయిలో ఏకమైన నేతలు ఇక జిల్లా స్థాయి నేతలను కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు.Telangana Congress : ఈరోజే సెకండ్ లిస్ట్
కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా ఖరారయిందని ఆ పార్టీ నేత మురళీధరన్ తెలిపారు. ఈరోజు తెలంగాణ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. 45 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. సీపీఎం, సీపీఐకి చెరో రెండు స్థానాలను ఇచ్చామని ఆయన తెలిపారు.జగన్ పై మాజీ జేడీ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ పాలనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జగన్ ప్రభుత్వంలో నాడు - నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ఆయన ప్రశంసించారు.కాళేశ్వరం కుంగిపోవడంపై మావోయిస్టుల లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాలన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అని ఆ లేఖలో పేర్కొన్నారు.Next Story