Thu Dec 19 2024 16:46:27 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తెలంగాణ ప్రజలకు సందేశాన్ని పంపిన సోనియా గాంధీ,తెలంగాణలో మొదలైన 144 సెక్షన్, బీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటనలు...
గల్లీ క్రికెటర్లకు సూపర్ గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
మన వీధుల్లో ఉండే పిల్లలలో, యువకుల్లోనూ ఎంతో ట్యాలెంట్ ఉంటుంది. చాలా మంది టెన్నిస్ బాల్ క్రికెట్ అద్భుతంగా ఆడుతూ ఉంటారు.. అలాంటి వారి లోని ట్యాలెంట్ ను బయటకు తీయడానికి ఒక కొత్త టోర్నమెంట్ రాబోతోంది. ట్యాలెంట్ ఉంటే గల్లీ నుండి క్రికెట్ స్టేడియం దాకా ఎదిగేలా చేయడంలో భాగంగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) రాబోతోంది. ఇందులో భాగంగా మొట్టమొదటి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నారు.తెలంగాణ ప్రజలకు సందేశాన్ని పంపిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. నవంబర్ 29న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. మార్పు కోసం, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని తెలంగాణలోని మా సోదరీమణులు, సోదరులు, కుమారులు, కుమార్తెలను అభ్యర్థిస్తున్నానన్నారు.
తెలంగాణలో మొదలైన 144 సెక్షన్
తెలంగాణలో 144 సెక్షన్ మొదలైంది. ఎన్నికలు ముగిసే వరకూ 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు అధికారులు. అయిదుగురు మించి ఎక్కడైనా కనిపిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు లిక్కర్ అమ్మకాలను ఆపివేశారు. బార్లు, వైన్ షాపులు పబ్ మూసివేస్తూ అధికారులు ఆదేశాలను జారీ చేశారు.Chiranjeevi : హీరోయిన్స్‌తో చిరు జల్సా.. మన్సూర్ సంచలన కామెంట్స్..
త్రిష-మన్సూర్ వివాదం కాస్త చిరంజీవి- మన్సూర్ వివాదంగా మారుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ.. హీరోయిన్ త్రిషని 'లియో' సినిమాలో రేప్ చేసే సీన్ తనకి రానందుకు చాలా ఫీల్ అయ్యాను అని మాట్లాడడం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పై రియాక్ట్ అవుతూ, త్రిషకి సపోర్ట్ గా మాళవిక మోహనన్, చిన్మయి, కుష్బూ, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్, చిరంజీవి.. మన్సూర్ పై అసహనం వ్యక్తం చేశారు.KCR : బీఆర్ఎస్ అధినేత సుడిగాలి పర్యటనలు... నెలన్నర అలుపు సొలుపు లేకుండా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేశారు. వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు ఆధారంగా ఆయన అలుపు విరామం లేకుండా అన్ని నియోజకవర్గాలను పర్యటించి వచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఆయన 96 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట నియోజకవర్గాలకు వెళ్లి చుట్టి వచ్చారు.Paleru : శ్రీమంతుల మధ్య సమరం... కానీ గెలుపోటములు మాత్రం?
తెలంగాణ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే బిగ్ ఫైట్ అనేక చోట్ల జరుగుతున్నా ప్రతిష్టాత్మకమైన పోరు పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇక్కడ మిలియనీర్లు పోటీ పడుతుండటమే. కరెన్సీ కట్టలు కట్టలుగా బయట పడుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు శ్రీమంతులే. ఈ ఎన్నికల్లో గెలుపును వారు సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరూ పార్టీలు మారిన వాళ్లే.Telangana Elections : భారీగా పట్టుబడుతున్న నగదు.. పట్టుబడింది ఎంతో తెలిస్తే?
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కుప్పలుకప్పులుగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఓటర్లను పంచడానికి అక్రమంగా డబ్బులను తరలిస్తూ పట్టుబడ్డారు. కోట్లాది రూపాయలను ఎన్నికల సమయంలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అన్ని నియోకవర్గాల్లో నలువైపుల పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్లైయింగ్ స్వ్కాడ్లు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉమ్మడిగా దాడులు చేసి దాదాపు 724 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.DeepFake Video : డీప్‌ఫేక్ ఆగడాలకు అసలు కారణం వారే.. ముందు వాళ్ళు మారాలి..
DeepFake Video : రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా పెద్ద చర్చినీయాంశం అయ్యింది. రష్మిక తరువాత కాజోల్, అలియా భట్.. ఇలా కొనసాగుతూనే ఉంది. ఆ డీప్‌ఫేక్ ఆగడాలను అడ్డుకోకపోతే భవిషత్తులో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందంటూ సినీ, రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డీప్‌ఫేక్ సమస్య ఏమి ఇప్పటిది కాదు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి.రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. రేపటి నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు రేపు సాయంత్రం నుంచే బయలుదేరి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
క్రికెట్ బ్యాట్ మీద పాలస్తీనా జెండా.. ఏమి జరిగిందంటే?
దేశవాళీ మ్యాచ్‌లో తన బ్యాట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించినందుకు పాకిస్థాన్ బ్యాటర్ అజం ఖాన్‌పై జరిమానా విధించాలనే నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తీసుకుంది. లాహోర్ బ్లూస్‌తో కరాచీ వైట్స్ తలపడినసమయంలో అజం ఖాన్ బ్యాట్ మీద పాలస్తీనా జెండా ఉంది. ఈ పని చేసినందుకు కరాచీ వైట్స్ ఆటగాడైన అజం ఖాన్ మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. అయితే, పీసీబీ దీనిని సమీక్షించి, మ్యాచ్ అధికారులు విధించిన పెనాల్టీని రద్దు చేయాలని నిర్ణయించింది.BJP : ప్రయోగాలతో కదన రంగంలోకి కమలం... ఫలించేనా?
తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి కొన్ని ప్రయోగాలు చేసింది. జనసేనతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల కదన రంగంలోకి దూకింది. 119 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఐదు జాబితాల్లో ప్రకటించింది. ముఖ్యమైన స్థానాలను గుర్తించి అక్కడ పాగా వేయగలిగే అభ్యర్థులను ఈసారి ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్లమెంటు సభ్యులను కూడా బరిలోకి దించింది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి సోయం బాపూరావును బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదేశించింది.Next Story