Thu Dec 19 2024 17:15:41 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మీ ఓటు ఎక్కడుంది? హైరానా అక్కర్లేదు..నేషనల్ అవార్డు బన్నీకే ఎందుకు.. దర్శకుడు వైరల్ కామెంట్స్..అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది
(Note: Please click the Headline for complete article)
Allu Arjun : నేషనల్ అవార్డు బన్నీకే ఎందుకు.. దర్శకుడు వైరల్ కామెంట్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. 69 ఏళ్ళగా ఉత్తమ నటుడు అవార్డు అనేది తెలుగువారికీ ఒక తీరని కలలా మిగిలిపోయింది. అలాంటి దానిని ఈ ఏడాది అల్లు అర్జున్ అందుకొని.. తెలుగులో ఫస్ట్ నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల తరువాత తెలుగువారి కల నెరవేరిందని కొందరు ఆనందిస్తుంటే, కొంతమంది మాత్రం కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు.Telangana Polling : మీ ఓటు ఎక్కడుంది? హైరానా అక్కర్లేదు.. సులువుగా తెలుసుకోండి ఇలా
తెలంగాణలో రేపు పోలింగ్ జరగబోతోంది. రేపు రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించే రోజు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. అందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రచారం నిర్వహించి ఓటర్లను చైతన్యవంతుల్ని చేసింది. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా పెద్ద యెత్తున ప్రకటనలు కూడా జారీ చేసింది. అయితే చాలా మంది తమకు ఓటు ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది.కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ఓటీటీ లోకి వచ్చేస్తోంది
రూల్స్ రంజన్.. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న విడుదలైంది. ఈ చిత్రానికి రథినం కృష్ణ దర్శకత్వం వహించాడు. స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మీటర్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత 2023లో కిరణ్ అబ్బవరం నుండి వచ్చిన మూడవ సినిమా. ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.యస్.. ఇట్స్ అఫీషియల్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పొడిగించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా ద్రావిడ్ కోచ్ గా కొనసాగనున్నారు. కోచ్ గా ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్ తో ముగిసింది. పలు సంప్రదింపుల అనంతరం కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ అంగీకరించడంతో బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతాడని, ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టును కూడా పొడిగిస్తున్నామని బోర్డు వెల్లడించింది.హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కమలాపూర్ ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
Narendra Modi : మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు వారికి
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ బియ్యాన్ని ఉచితంగా మరో ఐదేళ్లు అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డులున్న వారందరికీ ఉచితంగా బియ్యం ఇస్తూ వస్తున్నారు. దీనిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశ వ్యాప్తంగా 81 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.NTR : టీనేజ్లో ఎన్టీఆర్, శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేశాడట..
సినిమాల్లో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎంత ఇంటెన్సిటీతో ఉంటుందో.. ఆఫ్ స్క్రీన్ తారక్ చేసే అల్లరి కూడా అంతే ఇంటెన్సిటీతో ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాలు చూసిన వారంతా తన యాక్టింగ్ గురించి ఎలా మాట్లాడుతారో.. తనతో కలిసి పని చేసినవారు, తనతో స్నేహం చేసేవారు ఎన్టీఆర్ అల్లరి గురించి అంతగా మాట్లాడుతారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో తారక్ అల్లరి గురించి ఆడియన్స్ కి కూడా తెలిసింది.వంద వాహనాలకు జెండా ఊపి
వంద వాహనాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనములను జగన్ ఈ కార్యక్రమంలో అందచేశారు. తాడేపల్లి క్యాంప్ క్యారాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది.. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకంతో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. మొత్తం 119 రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగనుంది.
తెలంగాణ ఎన్నికలకు అంతా సిద్ధమవుతుంది. రేపు పోలింగ్ జరుగుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించి ఈవీఎంలతో పాటు సామాగ్రిని అందచేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగుతుంది. సమస్యాత్యక ప్రాంతాలను గుర్తించిన చోట కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story