Fri Dec 20 2024 01:50:22 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
అసెంబ్లీ పోరులో గల్ఫ్ లీడర్స్
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో... కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి వేములవాడ నుంచి, బీజేపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు నరేంద్ర పన్నీరు జగిత్యాల నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. ఈ రెండు ప్రధాన పార్టీలు వీరికి మొండి చేయు చూపాయి. బీఎస్పీ కూడా గల్ఫ్ కార్మిక నాయకుల అభ్యర్థనను పట్టించుకోలేదు.షాకింగ్ డెసిషన్.. పోటీ చేయకూడదని నిర్ణయం.. కాంగ్రెస్ కు మద్దతు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఆమె నిర్ణయించారు. మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు.మాది పాజిటవ్ అప్రోచ్... అలాగే ప్రజల వద్దకు వెళతాం
తెలంగాణ సమాన అభివృద్ధి కోరుకుంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు. సోనియాగాంధీ చొరవవల్లనే తెలంగాణ వచ్చిన విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.ఎమ్మెల్యేలు గెలిపిప్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది : కేసీఆర్
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కోరుట్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ప్రజస్వామ్య పరిణితి కాంక్షిస్తూ ముందుకు పోవాలని అన్నారు. ఓటును తమాషాగా తీసుకుంటే జీవితమే తలకిందులవుతుందని అన్నారు.దాడులు.. హస్తానికి మరింతగా కలసి వస్తాయా?
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. పన్నులు ఎగవేశారన్న కారణంతో ఈ దాడులు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ అది పైకి కనిపించే అంశమే. కానీ లోపలకు వెళితే మాత్రం రాజకీయ వేధింపులని చూసే వారికి ఇట్టే అర్థమవుతుంది.అది షర్మిల ఇష్టం : సజ్జల రామకృష్ణారెడ్డి
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వైఎస్ షర్మిల మద్దతివ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆమె నిర్ణయం ఆమె ఇష్టమేనని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై ఏ పార్టీ వేధించి కేసులు పెట్టిందో ఆ పార్టీతో చేతులు కలపడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు.సారా టెండూల్కర్ మూమెంట్స్ ను క్యాచ్ చేస్తున్న కెమెరాలు... అందుకేనా?
శుభమన్ గిల్ ఆటలో చెలరేగిపోతున్నాడు. బ్యాటింగ్ పరంగా గిల్ ఉంటే ఇక పూర్తి భరోసా. మినిమమ్ హాఫ్ సెంచరీ గ్యారంటీ. మంచి షాట్లతో అందరినీ అలరిస్తున్నాడు. శుభమన్ గిల్ టీం ఇండియా ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే గిల్ మనసులో ఉన్న దెవరు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.మంత్రులకు వార్నింగ్
పనిచేయని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. గెలుపును బట్టే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయంపు ఉంటుందని, అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తేడా చూడబోమని ఆయన అన్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.రామ్చరణ్ ధరించిన వాచ్ ఖరీదు తెలుసా..?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని టస్కనీ నగరంలో ఈ పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 1 రాత్రి గం.7:18 నిమిషాలకు వరుణ్, లావణ్య మేడలో వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్లు వేశాడు. ఇక పెళ్లికి మెగా అండ్ అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి, ఉపాసన ఫ్యామిలీ, బంధుమిత్రులు, పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు కూడా హాజరయ్యారు.కాంగ్రెస్ ను ఓడించడమెలా? జూబ్లీహిల్స్లో పోటీ వెనక అసలు కారణమిదే
తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది. బహదూర్ పుర, నాంపల్లి, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, యాకుత్ పుర, చంద్రాయణ గుట్ట, చార్మినార్, మలక్ పేట్, కార్వాన్ లలో పోటీ చేయాలని డిసైడ్ చేసింది. అయితే మిగిలిన ఎనిమిది స్థానాలను అటు ఉంచితే ఇప్పుడు జూబ్లీహిల్స్ పైనే పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.Next Story