Thu Dec 19 2024 16:56:02 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం,రాహుల్ నిర్ణయమే ఫైనల్.. ఆయన మనసులో ఎవరున్నారంటే?, మంత్రి పదవుల కోసం తహతహ.. నేతల్లో ఆశలు
(నోట్ : పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయగలరు)
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం: బండి సంజయ్
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందని, తనను ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'కేసీఆర్ గోవిందా' పాట
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మార్పు కావాలి అన్న నినాదంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కామారెడ్డి ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. గజ్వేల్‌లో మాత్రం గెలుపొందారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కేసీఆర్‌కు సంబంధించిన 'గోవిందా.. గోవిందా..కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి
శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు మరణించారు. ఈరోజు ఉదయమే ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధిలోని రావెల్లి శివారుల్లో జరిగింది. హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తి కూలిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా
పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశముంది. నిన్న ఫలితాలు వచ్చిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ ఎన్నికలలో సాధించిన ఘన విజయంతో అధికార పార్టీ ఉత్సాహంతో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో తమకు లభించిన విజయాన్ని సెలిబ్రేట్ చేసుకున్నారు.KCR : కేసీఆర్ ఇక అసెంబ్లీకి రాకపోవచ్చు.. రీజన్లు ఇవే
మూడో సారి ముఖ్యమంత్రి కావాలని భావించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ఆయన ఓటమి నుంచి కోలుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత ఆయన గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఇష్టపటం లేదు. ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. నిన్న రాత్రి ప్రభుత్వం ఇచ్చిన కాన్వాయ్ ను వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్ ముఖ్యమైన నేతలు ఎవరికీ అందుబాటులోకి రాలేదు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అధినాయకత్వానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశం తీర్మానించింది. ఇక పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో సోనియా గాంధీ జోక్యం కూడా ఉండకపోవచ్చు. ఆమె తెలంగాణ రాజకీయ నేతలకు తెలుసు కానీ.. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా ఆమెకు తెలియవు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
షాకింగ్.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ పై తీవ్ర విమర్శలు
ముంబైలోని కోహ్లీ రెస్టారెంట్ ఊహించని వివాదంలో చిక్కుకుంది. విరాట్ కోహ్లీకి చెందిన ప్రముఖ రెస్టారెంట్ వన్8 కమ్యూన్‌లోకి తనకు ప్రవేశం నిరాకరించారని ఓ వ్యక్తి చెబుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి తెల్లటి చొక్కా, పంచె ధరించాడు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ముంబైలోని కోహ్లీ రెస్టారెంట్ ముందే నిలబడి ఉన్నాడు.మిచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తూ ఉంది. భారీ వర్షాల కారణంగా చెన్నైను భారీ వర్షం ముంచెత్తింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయమని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా చెన్నై విమానాశ్రయం కార్యకలాపాలు నిలిపివేశారు. 12 దేశీయ విమానాలు, నాలుగు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మూడు అంతర్జాతీయ విమానాలను బెంగళూరుకు మళ్లించారు.
Michaung Cyclone : మిచౌంగ్ తుఫాన్...ముప్పు మామూలుగా ఉండదట
మిచౌంగ్ తుఫాను ప్రభావం క్రమంగా సీన్ చూపిస్తోంది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షం కురుస్తుంది. తీర ప్రాంతంలో హై అలర్ట్ ను ప్రకటించారు. పర్యాటకులను ఎవరినీ సముద్ర తీరానికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు.మంత్రి పదవుల కోసం తహతహ.. నేతల్లో ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఇక తమ కలలు నెరవేరినట్లేనని అందరూ భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తమకు మంత్రి పదవి గ్యారంటీ అని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సీనియర్లు ఎటూ ఆ రకంగానే ఆలోచిస్తారు. ఇక కొత్త వాళ్లు కూడా సామాజికవర్గం కోణంలో అదృష్టం తమ తలుపు తట్టుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ఆశావహులున్నారు.Next Story