Mon Dec 23 2024 10:02:14 GMT+0000 (Coordinated Universal Time)
లేటెస్ట్ టాప్ 10 న్యూస్ 6-9-2023
దేశం పేరు మారనుండా ?, ఆసియాకప్-సూపర్4 , రాజకీయాల వార్తలు, సినీ విశేషాలు...మరెన్నో
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఆసియా కప్ సూపర్-4 షెడ్యూల్
ఆసియా కప్ సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోరాడనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
లగడపాటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో?
ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గత కొన్నేళ్లుగా రాజకేయాలకు దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే విషయమై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించిన ఆయన.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సర్వేలతో వార్తల్లో నిలిచారనుకోండి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ లో మహిళను హత్య చేసి.. బంగ్లాదేశ్ సరిహద్దుకు పారిపోయాడు
నానకరామ్ గూడ లో మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా దారుణంగా హతమార్చి పశ్చిమ బెంగాల్ కు పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సైబరాబాద్ పోలీసులు ఈ హత్యకేసును చేధించారు. నిందితుడితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9999 నెంబర్ ప్లేట్ ధర ఎంత పలికిందంటే
ఫ్యాన్సీ నెంబర్లను తమ వాహనాల వెనుక తగిలించుకోవాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. లక్ కలిసొస్తుందనో.. లేక స్టేటస్ సింబల్ గానో భావించి ఫ్యాన్సీ నెంబర్లను భారీ ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2 కిలోల చేప రూ 26 వేలు..
వర్షాకాలం వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల మత్స్యకారులు ఆ చేప కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక మాంసం ప్రియులైతే వేల రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ఏడాది ఆ చేప రుచి చూడాలనుకుంటారు.
మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగమేంటి?
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు చేస్తుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆధార్‌కార్డు విషయంలో మోసాలు పెరిగిపోయాయి. మన ఆధార్ కార్డును ఇతరులు ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఆధార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపు గురించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అనుష్క, ప్రభాస్‌కి ఛాలెంజ్ ఇస్తే.. ప్రభాస్, రామ్ చరణ్‌కి..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక కొత్త ఛాలెంజ్ మొదలైంది. మనం సోషల్ మీడియాలో ఐస్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. అంటూ పలు ఛాలెంజ్స్ చూశాము. ఇప్పుడు ఒక సరికొత్త ఛాలెంజ్ ని హీరోయిన్ అనుష్క (Anushka Shetty) స్టార్ట్ చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
గోవింద కోటి రాస్తే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం.. ఎవరికంటే?
యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవారి ఆలయం నుండే తొలి అడుగు వేస్తున్నామని, ఇందులో భాగంగా రామకోటి తరహాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి తిరుమల స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
బ్యాంకు అధికారులకు మంత్రి నిర్మలమ్మ కీలక ఆదేశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అనుబంధించబడిన కోట్లాది మంది ఖాతాదారుల కోసం ఈ ఆదేశాలు జారీ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Next Story