Sun Nov 17 2024 20:40:41 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
బీజేపీ నాలుగో జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలయింది. పన్నెండు మంది అభ్యర్థులను సీట్లు ఖరారు చేస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది తర్వాత ఒకరు, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.బిగ్‌బాస్ హౌస్‌లోకి శివాజీ కొడుకు ఎంట్రీ..
Bigg Boss 7 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 సర్ప్రైజ్లతో చాలా ఇంటరెస్టింగ్ గా జరుగుతుంది. తొమ్మిది వారలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం 10వ వారం జరుపుకుంటుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 7.. గత వారం ఎలిమినేషన్ తో 11 మందికి చేరింది.చంద్రబాబు హయాంలో అన్నీ స్కాంలే...ఒక్క స్కీం పేరు చెప్పండి
రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ముందుగానే ప్రభుత్వం డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తుందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచన చేయలేదన్నారు.ఆంధ్రా షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు ..!
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీ కి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఆ పార్టీ నేతలు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
దీపావళి, ఇతర సందర్భాల్లో బాణాసంచా పేల్చకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. బాణాసంచా పేల్చడంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన పిటిషన్లను న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.రెండేళ్ల ముందు నుంచే గ్రౌండ్ రెడీ చేసినట్లుందిగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెండేళ్ల ముందే జగన్ పసిగట్టారు. టీడీపీ, జనసేన కలుస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల మధ్య పొత్తు కుదురుతుందని భావించిన జగన్ ముందు నుంచే తమ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.వాళ్లు గొడ్డలి భుజం మీద పెట్టుకుని రెడీ గా ఉన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు రాగానే అందరూ ఆగమాగం అవుతారని అలా కావద్దని అన్నారు. ఎన్నికల్లో ఓటు ఆషామాషీగా వేయవద్దని కోరారు. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వజ్రాయుధం మీ ఓటు అని అన్నారు.కరెంట్ బిల్లులు ఎవరూ కట్టొద్దు... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాఫీ
24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గద్వాల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.గవర్నర్ ను కలిసిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ బృందం కలిసింది. చంద్రబాబుపై వరసగా నమోదవుతున్న అక్రమ కేసులపై ఫిర్యాదు చేసింది. నారా లోకేష్ నేతృత్వంలో బృందం గవర్నర్ ను కలసి వినతి పత్రాన్ని సమర్పించింది. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని నారా లోకేష్ గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది.Pawan Kalyan : భద్రత కావాలంటే.. మోదీ మళ్లీ రావాల్సిందే
సకలజనుల సమ్మె చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకు వస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ చేరాలన్న ఆకాంక్షగా తెలంగాణ ఏర్పడిందన్నారు.Next Story