ysrcp ; చిన్న శ్రీను కు ఇచ్చింది బొత్స ను చూసి కాదట
విజయనగరం జిల్లాలో మరోసారి వైసీపీ పరిషత్ ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం జరిగిన పరిషత్ [more]
విజయనగరం జిల్లాలో మరోసారి వైసీపీ పరిషత్ ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం జరిగిన పరిషత్ [more]
విజయనగరం జిల్లాలో మరోసారి వైసీపీ పరిషత్ ఎన్నికల్లో విజయం దక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం జరిగిన పరిషత్ ఎన్నికల్లో 549 ఎంపీటీసీ స్థానాలకు 433, 34 జడ్పీటీసీ స్థానాలకు 34 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ కాబోతున్నారు. చిన్న శ్రీను మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయానా మేనల్లుడు.
బొత్స మేనల్లుడిగా….
బొత్స సత్యనారాయణ రాజకీయాలలో ఉన్న నాటి నుంచి చిన్న శ్రీను ఆయనకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు. పేరుకు మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నా చక్రం తిప్పేది చిన్న శ్రీను. గతంలో కాంగ్రెస్ హయాంలో బొత్స మంత్రిగా పనిచేసినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను రాజకీయంగా కీలకంగా మారారు. ఎన్నికల సమయంలోనూ బొత్స కుటుంబం చిన్న శ్రీను మీదనే ఆధారపడుతుందనడం అతిశయోక్తి కాదు.
జడ్పీ ఛైర్మన్ గా…
అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ గా చిన్న శ్రీనును వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇది బొత్స సత్యనారాయణను చూసి కాదట. కేవలం చిన్న శ్రీను పార్టీ కోసం పడుతున్న శ్రమకు జగన్ ఈ పదవిని గిఫ్గ్ గా ఇచ్చారంటున్నారు. చిన్న శ్రీను జడ్పీటీసీగా మెరక ముడిదాం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మజ్జి శ్రీనివాసరావు పేరు ను వైసీపీ అధినాయకత్వం ఖరారు చేయడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.
జగన్ దృష్టిలో పడి…
2019 ఎన్నికల్లో చిన్న శ్రీనుకు ఎస్ కోట టిక్కెట్ ఇస్తామని చెప్పినా వద్దని జగన్ కు నేరుగా చెప్పడం ఆయనకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది. తాను జిల్లా అంతటా గెలుపుకోసం ప్రయత్నిస్తానని, ఆశావహులు ఎక్కువగా ఉన్నందున తనకు టిక్కెట్ అవసరం లేదని చెప్పడంతో చిన్న శ్రీను జగన్ దృష్టిలో పడ్డారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలను ఎవరినీ నొప్పించకుండా చేయడంలో చిన్న శ్రీను దిట్ట. అందుకే ఆలస్యమైనా చిన్న శ్రీనుకు మంచి పదవే వచ్చిందంటున్నారు. బొత్స మేనల్లుడయినా ఆయనను చూసి జగన్ ఇవ్వలేదట. చిన్న శ్రీను పార్టీ కోసం పడ్డ శ్రమను చూసే ఇచ్చారంటున్నారు.