ఎస్సైలపై షో ఎఫెక్ట్
అనుమతిలేకుండా సినిమాకి వెళ్ళిన ఆరుగురు ఎస్ఐలపై వేటు పడింది. కర్నూలు జిల్లాలో బెనిఫిట్ షో కి వెళ్లిన ఆరుగురు ఎస్ఐలపై వేటు వేస్తూ ఎస్పీ పకీరప్ప నిర్ణయం [more]
అనుమతిలేకుండా సినిమాకి వెళ్ళిన ఆరుగురు ఎస్ఐలపై వేటు పడింది. కర్నూలు జిల్లాలో బెనిఫిట్ షో కి వెళ్లిన ఆరుగురు ఎస్ఐలపై వేటు వేస్తూ ఎస్పీ పకీరప్ప నిర్ణయం [more]
అనుమతిలేకుండా సినిమాకి వెళ్ళిన ఆరుగురు ఎస్ఐలపై వేటు పడింది. కర్నూలు జిల్లాలో బెనిఫిట్ షో కి వెళ్లిన ఆరుగురు ఎస్ఐలపై వేటు వేస్తూ ఎస్పీ పకీరప్ప నిర్ణయం తీసుకున్నారు . ఇవాళ ఉదయం ఫ్యాన్స్ కోసం కర్నూలు పట్టణంలో సైరా సినిమా బెనిఫిట్ షో వేశారు . ఈ షో ను చూసేందుకు కర్నూలు పట్టణం చుట్టుపక్కల ఉన్న 6 గురు ఎస్ఐలు అక్కడికి వెళ్లారు. తెల్లవారుజామున హాజరైన వీళ్లంతా కూడా సినిమా చూశారు .సినిమా చూసిన తర్వాత సెల్ఫీ ఫోటో ఒకటి తమ గ్రూపులో పోస్ట్ చేశారు. ఈ ఫోటో చివరికి ఎస్పీ పకీరప్ప వద్దకు చేరుకుంది .
మీరే అలాచేస్తే ఎలా…?
విధుల్లో ఉండి తనకు చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు ఆ ఎస్సైలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే వారిపై బదిలీ వేటు వేశారు. తన అనుమతి లేకుండా సినిమాకు ఎందుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ పకీరప్ప బెనిఫిట్ షో ల వద్ద తప్పనిసరిగా పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ గా ఉండాల్సిన సమయంలో మీరు సినిమాకు వెళ్తే ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారో తెలుసుకోవాలని సదరు సిబ్బందిని ఎస్పీ ప్రశ్నించారు. సినిమాకు వెళ్ళిన వారిలో శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్.ఐ హరిప్రసాద్, బండిఆత్మకూర్ ఎస్.ఐ వెంకటసుబ్బయ్య, రాచర్ల ఎస్.ఐ ప్రియతంరెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ అశోక్ లు ఉన్నారు. వీరిని వెంటేనే విఆర్ కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.