ఆయనే మహానటుడా.. ?
నిన్న ఆదివారం తాడేపల్లి గూడెం లో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణకు హాజరైన మెగాస్టార్ చిరుని ఆయన అభిమానులు ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన [more]
నిన్న ఆదివారం తాడేపల్లి గూడెం లో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణకు హాజరైన మెగాస్టార్ చిరుని ఆయన అభిమానులు ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన [more]
నిన్న ఆదివారం తాడేపల్లి గూడెం లో ఎస్వీఆర్ విగ్రహావిష్కరణకు హాజరైన మెగాస్టార్ చిరుని ఆయన అభిమానులు ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన చిరంజీవి తనకి ఇష్టమైన నటుడు ఎస్వీఆర్ అని, ఆయన మహానటుడు అంటూ చాలా గొప్పగా మట్లాడాడు. చిరు దృష్టిలో ఎస్వీఆర్ తప్ప మిగతావారెవరూ మహానటులు కాదా? లేదంటే మిగతా వారిని చిరు మర్చిపోయాడా? అంటూ అక్కినేని, నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎస్వీఆర్ కన్నా ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులు మహానటులు కారా? అంటూ చిరుని నేరుగా ప్రశ్నిస్తున్నారు.
ఈ కాంట్రవర్సీ ఎందుకు?
చిరు కుల సమీకరణలతోనే ఎస్వీఆర్ మహానటుడు అంటూ పొగిడాడని, ఎస్వీఆర్ కాపు కులస్తుడు కావడంతోనే చిరు స్వార్ధంతో ఆయన మహానటుడు అన్నాడని అంటున్నారు. ఎస్వీఆర్ మహానటుడే ఎవరు కాదన్నారు. కానీ మహనీయుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు మహానటులు కదా? అంటూ వారు తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. సైరా సినిమాతో సక్సెస్ కొట్టిన చిరు ఇలా ఈ చిన్న కాంట్రవర్సీకి వేదికగా మారాడు.