Thu Dec 19 2024 08:38:31 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు.. అక్కడే పంచాయతీ
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు వీళ్లంతా ఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిని [more]
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు వీళ్లంతా ఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిని [more]
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు వీళ్లంతా ఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిని కాంగ్రెస్ చవి చూసింది. డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో ఈ ఎన్నికపై చర్చించేందుకు పార్టీ నేతలను హైకమాండ్ ఢిల్లీకి రమ్మని పిలిచింది. రాహుల్ గాంధీతో పాటు మరికొందరు సీనియర్ నేతలతో సమావేశమవుతారు. హుజూరాబాద్ లో డిపాజిట్లు రాకపోవడానికి గల కారణాలను వివరిస్తారు. కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కయిందన్న ఆరోపణల నేపథ్కంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది
Next Story