విజయ్ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన సినిమాలు పెద్దపెద్ద బ్యానర్స్ తో చేస్తున్న విజయ్ తన సినిమాల వల్ల [more]
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన సినిమాలు పెద్దపెద్ద బ్యానర్స్ తో చేస్తున్న విజయ్ తన సినిమాల వల్ల [more]
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన సినిమాలు పెద్దపెద్ద బ్యానర్స్ తో చేస్తున్న విజయ్ తన సినిమాల వల్ల ప్రొడ్యూసర్స్ ముందే లాభాల్ని తెచ్చుకుంటున్నారని గమనించి తన సొంత ప్రొడక్షన్ అయినా 'కింగ్ ఆఫ్ ది హిల్స్' అనే ఓ సొంత నిర్మాణ సంస్థని స్థాపించాడు.
అయితే ఇప్పటివరకు ఇందులో తన సొంత సినిమాలు చేయలేదు విజయ్. అయితే సడన్ గా మాత్రం ప్లాన్ మార్చేశాడు. ఇకపై తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గ ప్లాన్ కూడా వేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
ఇవి గీత గోవిందం కి ముందు, పెళ్లి చూపులులకి ముందు ఒప్పుకున్నవే. అందుకే ఇవి ముందు కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు. ఇవి పూర్తి అయ్యే సరికి 2020 అవుతుంది. ఆ తరవాత… సొంత బ్యానర్లోనే సినిమాలు చేయబోతున్నాడట. ఒకవేళ పెద్ద సంస్థలు వస్తే…తన పారితోషికాన్ని మినహాయించుకుని, వాటా దారుడిగా చేయబోతున్నాడట. ప్రస్తుతం విజయ్ బ్యానర్ లో తన తమ్ముడు సినిమా 'దొరసాని' రాబోతుంది.