కమ్మ రాజకీయాలకు ఇక కాలం చెల్లబోతుందా ?
జగన్ సునామీలో కూడా ఎదురు నిలిచి జయకేతనం ఎగురవేసిన టిడిపి కంచుకోటలపై వైసిపి సీరియస్ గానే కన్నేసింది. అందులో ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గం కూడా [more]
జగన్ సునామీలో కూడా ఎదురు నిలిచి జయకేతనం ఎగురవేసిన టిడిపి కంచుకోటలపై వైసిపి సీరియస్ గానే కన్నేసింది. అందులో ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గం కూడా [more]
జగన్ సునామీలో కూడా ఎదురు నిలిచి జయకేతనం ఎగురవేసిన టిడిపి కంచుకోటలపై వైసిపి సీరియస్ గానే కన్నేసింది. అందులో ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ అపజయం లేకుండా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న వేగుళ్ళ జోగేశ్వర రావు కు చెక్ పెట్టేందుకు 2014 , 2019 ఎన్నికల్లో వైసిపి వేసిన ఎత్తుగడలు ఫలించలేదు. ఎలక్షన్ ఇంజనీరింగ్ లో రాటుదేలిన వేగుళ్ల ను ఓడించేందుకు జగన్ ఇక్కడ మాజీ ఎమ్యెల్యే, మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామి నాయుడు ను 2014 లో ఎమ్యెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపినా పని జరగలేదు. ఆ తరువాత తమ పార్టీ తురుపు ముక్క సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రామచంద్రపురం నుంచి మండపేటకు తెచ్చి మరీ పోటీ చేయించారు 2019 లో జగన్. అయితే ఈ ఎత్తుగడ కూడా ఫలించలేదు.
పునాదులు కదపాలనే …
దీంతో ఎలాగైనా జోగేశ్వరరావు జోరు కు కళ్లెం వేయాలని భావించిన ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఈసారి మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులకు పెద్ద బాధ్యతే నెత్తిన పెట్టింది. దాంతో బాటు ఆయన పనితీరు బావుంటే ఎమ్యెల్సీ గా కూడా ఆఫర్ ఇచ్చేసింది. ఇంకేముంది మొన్నటి స్థానిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు తన సత్తా చాటి చెప్పేశారు. మండపేట మునిసిపాలిటీ లో వైసిపి జండా ఎగిరేలా అది కూడా అదిరే రిజల్ట్ తో తెచ్చి పెట్టారు. ఈ దెబ్బతో రాబోయే 2024 ఎన్నికల్లో జోగేశ్వర రావు పునాదులను త్రిమూర్తులు పెకలిస్తారన్న నమ్మకంతో తోట త్రిమూర్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్యెల్సీ ని గవర్నర్ కోటాలో ఇచ్చేశారు జగన్. ఈ పరిణామాలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలవరానికి గురిచేస్తున్నాయి.
మండపేట తో మొదలు పెట్టి …
ఏ పార్టీ టికెట్ ఇవ్వలిసి వచ్చినా కమ్మ సామాజికవర్గం సీటుగా ముద్రపడిన మండపేట లో ఆ సామాజిక వర్గానికి అస్తిత్వం లేకుండా వైసిపి దశాబ్దకాలంగా వేస్తున్న స్కెచ్ లు ఇప్పుడే వర్క్ అవుట్ అవ్వడం మొదలు పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో కనీసం నాలుగు స్థానాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి టికెట్లు పొందే కమ్మ సామాజికవర్గానికి మండపేట వంటి పెట్టని కోటలో ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ లో వైసిపి అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు ప్రధాన పక్షం టిడిపి సైతం తప్పనిసరిగా అనుసరించకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పెద్దాపురం స్థానం కాపు సామాజిక వర్గానికి సంప్రదాయాలకు భిన్నంగా కమ్మకు కాకుండా కాపు సామాజికవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్పకు టిడిపినే కేటాయించాలిసివచ్చింది.
ఆ మూడు టార్గెట్ గా …
కమ్మ సామాజికవర్గానికి ఇక మిగిలినవి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, రాజా నగరం, మండపేట లు మాత్రమే. ఈ మూడింటిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు లు సైకిల్ పార్టీ నుంచి గెలుపొందగా, రాజానగరం నుంచి పోటీ చేసిన పెందుర్తి వెంకటేష్ ఘోరపరాజయం పొందారు. దాంతో వచ్చే ఎన్నికల్లో సామాజికవర్గాల సమతూకంతో టిక్కెట్లు ఇవ్వలిసి వస్తే మండపేట తప్ప మరెక్కడా కమ్మ సామాజిక వర్గానికి తూర్పుగోదావరి నుంచి తెలుగుదేశం టిక్ పెట్టలేని స్థితి. కాకినాడ కాపు సామాజికవర్గానికి రాజమండ్రి కమ్మ సామాజికవర్గానికి పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి టిక్కెట్లకు టిక్ పెడుతూ వచ్చేది. దీనికి కూడా గత ఎన్నికల్లో జగన్ బ్రేక్ వేస్తూ తమ పార్టీ నుంచి బిసి అభ్యర్థి భరత్ రామ్ కు టికెట్ ఇచ్చి గెలిపించారు. దాంతో రాజమండ్రి ఎంపి సీటు కు వచ్చే ఎన్నికల్లో బిసి లేదా కాపులకే తెలుగుదేశం కేటాయించాలిసిన పరిస్థితి. వైసిపి తన వ్యూహాలు ఇలాగే కొనసాగిస్తే కమ్మ సామాజికవర్గానికి స్థానం లేకుండా చేసేలాగే వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏ పదవి లేకుండానే మొన్నటి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన తోట త్రిమూర్తులు ఇప్పుడు ఎమ్యెల్సీ పదవి కూడా తోడు కావడంతో మరింత చెలరేగుతారని మండపేట కోట లో ఫ్యాన్ తిప్పేస్తారన్నది అంచనా. జిల్లాలో బలమైన కాపునేతగా ముద్రపడిన తోట త్రిమూర్తులు పలు నియోజకవర్గాల్లో సైతం తన సామాజికవర్గం ఓటర్లను ప్రభావితం చేయగలరు. ఆయన సేవలను అన్నివిధాలా వినియోగించుకునేందుకే తెలుగుదేశానికి చుక్కలు చూపడానికే జగన్ ముందస్తు వ్యూహం అనుసరిస్తున్నారన్నది స్పష్టం అవుతుంది.