'యోధుడు'గా మారనున్న బాలయ్య....!
తన 100వ చిత్రం విషయంలో ఎవరికి, ఎప్పుడు చాన్స్ ఇస్తాడు? కథ ఎలా ఉండబోతోంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు చివరకు క్రిష్‌ను దర్శకునిగా ఎంపిచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు నందమూరి బాలకృష్ణ, ఇప్పటివరకు తన కెరీర్లో పెద్దగా కమర్షియల్ హిట్‌లేని క్రిష్‌ను ఆయన ఎంపిక చేయడం చాలా మందికి షాక్ ఇచ్చింది. కాగా 1వ శతాబ్దానికి చెందిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' జీవిత చరిత్ర ఆధారంగా ఈ హిస్టారికల్ మూవీ తెరకెక్కనుంది. అమరావతిని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్రతో ఈ సినిమా చేయనుండగా, ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ 'గౌతమి పుత్ర శాతకర్ణి' టైటిల్‌నే పెట్టాలని భావించాడు. కానీ బాలయ్య మాత్రం ఈ టైటిల్‌ను పెడితే అందరికీ నచ్చదని భావించి తన స్లైల్లోనే ఓ పవర్ఫుల్ టైటిల్‌ను క్రిష్‌కు సూచించాడని సమాచారం. ఆ టైటిల్ 'యోధుడు' కావడంతో చాలా పవర్‌గా ఉంటుందని బాలయ్య భావిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా జూన్ 18 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడని సమాచారం ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. కానీ ఈ చిత్రం హిస్టారికల్ చిత్రం కావడంతో అంత త్వరగా సినిమాను పూర్తి చేసే అవకాశం ఉండదని, అందులో క్రిష్ తన సినిమాలను ఎంతో పర్పెక్షన్తో ప్రతి పాయింట్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడనే పేరు ఉండటంతో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ను టార్గెట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.