Sat Dec 21 2024 11:04:15 GMT+0000 (Coordinated Universal Time)
జిమ్ చేస్తున్న మహిళలు.. ఒక్కసారిగా జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు
జిమ్.. బాగా కేలరీలు కరిగించుకోవాలని.. వీలైనంత త్వరగా మంచి షేప్ లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కార్డియో కావాలనుకుంటే కార్డియో.. వెయిట్స్ తగ్గించుకోవడం కోసం మెషీన్లు. ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఉంటాయి. ఒకరి తర్వాత మరొకరు చేసుకుంటూ వెళ్లిపోవడమే. జిమ్ ఇన్స్ట్రక్టర్ సూచనలు పాటిస్తూ చేసేసుకుంటూ వెళ్లిపోయే వారు కొందరైతే.. నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్లిపోయే వారు ఇంకొందరు.
జిమ్ లో ఎలా పడితే అలా వెయిట్స్ మోస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. గాయాలు కూడా అవుతాయి. కానీ వైరల్ అవుతున్న వీడియోలో జిమ్ ఎక్విప్మెంట్ వాడటానికి గొడవపడడంతో నెటిజన్లు కాస్తా అవాక్కవుతూ వస్తున్నారు. ఒక వీడియోలో ఒక మహిళ లోపలికి ప్రవేశించి, జిమ్ సామగ్రిని, స్మిత్ మెషీన్‌ను ఉపయోగించడానికి లైన్లో ఉన్న మరొకరిని నెట్టింది. స్మిత్ మెషీన్ వద్ద మరొక మహిళ తన సెట్‌ను ముగించినప్పుడు నల్ల చొక్కా ధరించిన మహిళ తన వంతు కోసం వేచి ఉన్నట్లు చూపిస్తుంది. ఆమె ముందున్న మహిళ తన సెట్ ను పూర్తి చేసిన తర్వాత.. నలుపు రంగు టీ షర్ట్ మహిళ స్మిత్ మెషీన్ వైపుకు వెళ్ళింది.. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన మరొక స్త్రీ ఉన్నట్లుండి ఆ మెషీన్ లో తానే వ్యాయామం చేస్తా అన్నట్లుగా వచ్చి.. నలుపు రంగు టీ షర్ట్ మహిళను పక్కకు నెట్టేసింది. ఇంతలో అక్కడ ఊహించని విధంగా గొడవ మొదలైంది. ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఇంతలో మరో ఇద్దరు మహిళలు అక్కడకు చేరుకొని గొడవ పడుతున్న ఇద్దరినీ విడిపించారు.
ఈ గొడవలో ఎవరికీ పెద్దగా గాయాలు అయినట్లు ఎలాంటి నివేదికలు కనిపించలేదు.. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని జిమ్ లో మ్యూజిక్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో 45 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే.
Next Story