Viral Video: భయపడకు నేనున్నా.. పటాకుల శబ్దానికి కుక్క చెవులు మూసిన చిన్నారి
Viral Video: అప్పుడప్పుడు చిన్న పిల్లలు చేసే చేష్టల వీడియోలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో..
Viral Video: అప్పుడప్పుడు చిన్న పిల్లలు చేసే చేష్టల వీడియోలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడు పటాకుల శబ్దానికి భయపడిన కుక్కను ఓ చిన్నారి తన చిన్న చేతులతో కుక్క చెవులను కప్పి, పటాకుల శబ్దం వినపడకుండా కాపాడిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆ చిన్నారి అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో X ఖాతా @ThebestFigenలో పోస్టు చేయబడింది. వీడియోలో బాణాసంచా శబ్దానికి భయపడిన ఒక చిన్నారి తన చేతులతో దాని చెవులను కప్పి పెంపుడు కుక్కను రక్షించడాన్ని చూడవచ్చు.
వైరల్ అయిన వీడియోలో ఒక చిన్న అమ్మాయి తన కుక్కపిల్లని రోడ్డు పక్కన నిలుచుని పెట్టుకుంది. ఇంతలో పెద్దగా క్రాకర్స్ శబ్దం వినిపిస్తోంది. ఆ అమ్మాయి తన చిన్ని చేతులతో పెంపుడు కుక్క చెవులను పట్టుకుని, "అయ్యో నా ప్రియమైన కుక్కపిల్ల పటాకుల శబ్దానికి భయపడుతోంది." ఆ తర్వాత కుక్కను ముద్దుగా పెడుతూ, తల వంచుకుని, 'భయపడకు, నేనిక్కడ ఉన్నాను.' అన్నట్లుగా తలపై నిమిరింది ఆ చిన్నారి.
జనవరి 8న షేర్ చేసిన ఈ వీడియోకి 7.7 మిలియన్ వ్యూస్, ఒకటిన్నర మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.