Sun Dec 22 2024 23:40:37 GMT+0000 (Coordinated Universal Time)
Vande Bharat Train : తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ప్రారంభం
రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే మరో వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది
Vande Bharat Train :రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే మరో వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. మరొక వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలలో పరుగులు తీయనుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ మేరకు ప్రకటించారు. విశాఖ నుంచి హైదరాబాద్కు మరో వందేభారత్ రైలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైలు నేటి నుంచి పరుగులు పెట్టనుంది. ఇప్పటికే విశాఖ - హైదరాబాద్ మధ్య ఒక వందేభారత్ రైలు ఉంది. ఈ రైలుకు మంచి ఆదరణ ప్రయాణికుల నుంచి లభిస్తుంది. సీట్లు దొరకడం కూడా కష్టంగానే మారింది. అందువల్లనే దక్షిణ మధ్య రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ ఈ రెండు నగరాల మధ్య మరో వందేభారత్ రైలును నడిపేందుకు అంగీకరించింది.
వంద శాతం ఆక్యుపెన్సీతో...
నూరు శాతం ఆక్యుపెన్సీతో తొలి రైలు నడుస్తుండటంతో మరో రైలును వెంటనే రైల్వే శాఖ మంజూరు చేసింది. తెలంగాణలో ఈ వందేభారత్ రైలు నాలుగోదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు ప్రారంభమయ్యే రైలు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ లో ఈ రైలు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలులో మొత్తం 530 మంది ప్రయాణించే వీలుంది. ఈ రైలును వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ రైలులో కూడా ఆక్యుపెన్సీ రేటు వంద శాతం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రైలు రాకతో తెలుగు ప్రజలకు రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులువుగా మారనుంది.
Next Story