అంబులెన్స్ లేక మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు మోసుకుంటూ..
ఏపీలోని అల్లూరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ లేకపోవడంతో ఆసుపత్రి నుంచి గ్రామానికి మృతదేహం
ఏపీలోని అల్లూరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ లేకపోవడంతో ఆసుపత్రి నుంచి గ్రామానికి మృతదేహం తరలించారు బంధువు. మృతదేహాన్ని దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర మోసుకుంటూ వెళ్లారు. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అనారోగ్యం తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అద్దన్న మృతి చెందినట్లు నిర్దారించ్చారు. అయితే మృతదేహాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ను ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. అంబులెన్స్ అందుబాటులో లేదని, ఆలస్యం అవుతుందని చెప్పడంతో మృతుని బంధువు చేసేదేమి లేక నాలుగు కిలోమీటర్ల మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ను ఆసుపత్రి సిబ్బంది నిరాకరించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్ సదుపాయాలు లేవు. ఒక వేళ ఎవరైనా చనిపోతే ప్రైవేటు వాహనాలే దిక్కు. ఇక ప్రైవేటు వాహనాలకు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు భుజాలపై మోసుకెళ్లడమే దిక్కు. అందుకే ఇక్కడికి వచ్చిన రోగి చనిపోయినట్లయితే అంబులెన్స్లేక ఇదే పరిస్థితి దాపురిస్తోంది. యితే ప్రైవేట్ వాహనాల కూడా మృతదేహం తరలించేందుకు అందుబాటులో లేకపోవడంతో.. అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందికి అడిగారు బంధువులు. అయితే అందుబాటులో లేక ఇలాంటి పరిస్థితి వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువు కోరుతున్నారు.
ఈ ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సీరియస్ అయ్యారు. ఘటనపై చారణకు ఆదేశించారు. అంబులెన్స్ రాక ఆలస్యం అవడంతో సగం దూరం వెళ్ళిన తర్వాత వాహనం అందుబాటులోకి వచ్చినా మృతదేహం అందులో తరలించేందుకు బాధిత బంధువులు నిరాకరించినట్టు ప్రాథమికంగా తెలుసుకున్నారు అధికారులు. దీనిపై పూర్తి విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.