Fri Apr 04 2025 06:14:14 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రం వెనక్కు వెళ్లిందే
విశాఖపట్నంలో సముద్రపు అలల్లో మార్పులు కనిపిస్తున్నాయి. నాలుగు వందల మీటర్లు వెనక్కు వెళ్లింది

విశాఖపట్నంలో సముద్రపు అలల్లో మార్పులు కనిపిస్తున్నాయి. నాలుగు వందల మీటర్లు వెనక్కు వెళ్లింది. బీచ్ ను చూస్తే ఒళ్లు పులికించిపోతుంది. ఖచ్చితంగా సముద్రస్నానం చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే అలల ఉధృతి పాదాలు స్పృశిస్తుంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అందుకే బీచ్ కు నిరంతరం పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
వీకెండ్ కావడంతో...
అయితే నిన్న వీకెండ్ కావడంతో విశఆఖపట్నంలోని ఆర్కే బీచ్ ఎక్కువ మంది పర్యాటకులు వచ్చారు. కానీ అదే సమయంలో సముద్రం నాలుగు వందల అడుగులకు వెనక్కు వెళ్లిపోవడంతో బండరాళ్లు బయటపడ్డాయి. దీంతో రాళ్లు చూసేందుకు మరింత అందంగా కనిపడింది. దీంతో వాటిపైకి ఎక్కి సెల్ఫీలు దిగారు. పోలీసులు మాత్రం సముద్రు అలలు ఎప్పుడైనా ముందుకు రావచ్చని, ప్రమాదంలో పడవద్దని హెచ్చరించారు.
Next Story