Thu Jan 09 2025 07:01:52 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : మోదీ ప్రసంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఏదీ?
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గత కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ కు మాత్రం ప్రధాని ప్రసంగంలో చోటు దక్కలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ లో పర్యటించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు గత కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ కు మాత్రం ప్రధాని ప్రసంగంలో చోటు దక్కలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటే దాదాపు ఏడాదికిపైగానే ఆందోళన చేస్తున్నారు. ప్రధాని విశాఖ వచ్చిన తర్వాత ఈ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి మాత్రం ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం కార్మికులకు మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
మిత్రపక్షంగా ఉన్న...
కూటమిలో మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్, చంద్రబాబులు ఎలాగైనా ప్రధాని మోదీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ లేదని చెప్పిస్తారని నమ్మిన కార్మికులకు నిరాశ ఎదురయింది. మరోవైపు అనకాపల్లిలో మరో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం కూడా కార్మికులలో ఆందోళన నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసేందుకే ఈ ప్రాంతంలో మరో ప్రయివేటు స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినప్పటికీ అసలైన సమస్యపై స్పందించలేదని కార్మిక సంఘాలు తమ ఆందోళన ను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.
Next Story