Mon Dec 23 2024 10:54:09 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ కేజీహెచ్ లో అరుదైన ఆపరేషన్
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ ను నిర్వహించారు. లిథోపెడియన్ అనే పదార్థాన్ని తొలగించారు.
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ ను నిర్వహించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ఆమె కడుపు నుంచి లిథోపెడియన్ అనే గడ్డ లాంటి పదార్థాన్ని తొలగించారు. దీనిని స్టోన్ బేబీ అని కూడా వైద్య పరిభాషలో పిలుస్తారని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సను చేసి ఈ అరుదైన పదార్థాన్ని తొలగించారు. . మహిళకు పలు మార్లు అబార్షన్ అయింది. దీంతో ఆమెక మూడేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుందని వైద్యులుతెలిపారు. దీంతో ఆమె కడుపు నొప్పిని భరించలేక వైద్యులను సంప్రదించగా అది లిథోపెడియన్ గా తేల్చామన్నారు.
లిథోపెడియన్ అంటే?
లిథోపెడియన్, గ్రీకు పదాల లిథోస్ (రాయి) మరియు పెడియోన్ (చైల్డ్) నుంచి వచ్చింది, ఇది ఒక శాతం కంటే తక్కువ ఎక్టోపిక్ గర్భాలలో సంభవించే అరుదైన విషయమని వైద్యులు చెబుతున్నారు. ఇది పొత్తికడుపు ఎక్టోపిక్ గర్భధారణ సమయంలో పిండం చనిపోవడం-గర్భం వెలుపల పిండం అభివృద్ధి చెందడం-తదనంతరం కాల్సిఫైడ్ అవుతుందని తెలిపారు. ఇది చాలా అరుదుగా మహిళల్లో కనిపిస్తుంటుందని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో మహిళ క్షేమంగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ పి. శివనాధ్ తెలిపారు. డాక్టర్ ఆనంద్, డాక్టర్ శివప్రకాష్తో పాటు డాక్టర్ ఐ.వాణి నేతృత్వంలోని శస్త్ర చికిత్స బృందం దీనిని విజయవంతంగా తొలగించారని తెలిపారు.
Next Story