Mon Dec 23 2024 12:34:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. ఆసుపత్రిలో చెలరేగిన మంటలు
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో రోగులు ఉండటంతో ఎంతమంది చిక్కుకున్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఆసుపత్రిలోని జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ ఆసుపత్రిలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. పెద్దయెత్తున పొగలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
ఊపిరాడక...
పొగలు వస్తుండటంతో ఊపిరాడక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండో అంతస్థు మాత్రమే కాకుండా ఆసుపత్రి నుంచి రోగులు బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణం అంటూ ఇంకా తెలియరాలేదు. ఆసుపత్రిలో ఎందరు రోగులున్నారన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది రోగులను ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు తెలిసింది.
Next Story