Mon Dec 23 2024 10:27:20 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్
2023 ఫిబ్రవరి నెలలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించనున్నారు.
2023 ఫిబ్రవరి నెలలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సదస్సు లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని రెండేళ్ల క్రితమే నిర్వహించాలని అనుకున్నామని, అయితే కోవిడ్-19 కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. విశాఖపట్నంలో త్వరలో మహిళా పారిశ్రామికవేత్తల పార్కు(women entrepreneurs park) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇతర జిల్లాల్లో కూడా ఈ పార్కులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు.
మూడు రాజధానులే తమ ఎజెండా అని చెబుతున్న వైసీపీ నేతల్లో గుడివాడ అమర్ నాథ్ ఒకరు. తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని ఆయన గతంలోనే తేల్చి చెప్పారు. మూడు రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళతామని తెలిపారు.
Next Story