Thu Dec 26 2024 12:18:45 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖలోని గోపాలపట్నం లో గల దుస్తుల దుకాణంలో ఈ ప్రమాదం సంభవించింది.
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖలోని గోపాలపట్నం లో గల దుస్తుల దుకాణంలో ఈ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న యువరాణి టెక్స్ టైల్స్ బట్టల దుకాణం లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్దయెత్తున ఎగిసి పడుతుండటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
దుస్తుల దుకాణంలో...
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ ప్రాధమిక అంచనా వేసింది. ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. చుట్టుపక్కల షాపులకు కూడా మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
Next Story