వైజాగ్ ఎయిర్ పోర్టు.. నాలుగు నెలలు ఆంక్షలే
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా
రన్‌వే పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాత్రి సమయంలో విమానాలు నాలుగు నెలలకు పైగా నిలిపివేయనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో రాత్రివేళ విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. వైజాగ్ ఎయిర్‌పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్ వే మీదుగానే జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్‌వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. ఇందులో భాగంగా రన్‌వేపై మూడు పొరల్ని తొలగించి మళ్లీ కొత్తగా వేస్తారు. ఐఎన్ఎస్ డేగాలో 2019లో రీ-సర్ఫేసింగ్ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు దాకా రీ-సర్ఫేసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.