Narendra Modi : ఏపీ ప్రజలకు నేడు మోదీ గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
ఈరోజు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. రోడ్ షో తో పాటు ఇరవై పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. రోడ్ షో తో పాటు ఇరవై పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో రోడ్ షో జరుగుతుంది. ఇప్పటికే అధికారులు అంందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తును ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఎన్ఎస్జీ కమాండోల చేతిలోకి విశాఖ వెళ్లిపోయింది. ఈరోజు సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విమానంలో విశాఖపట్నం చేరుకుని సాయంత్రం 4.45 గం.ల నుండి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారు. అనంతరం సాయంత్రం 5.30 గం.ల నుండి 6.45 గం.ల వరకూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ