Thu Dec 26 2024 09:05:23 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. రైల్వే జోన్ ఏర్పాటుకు?
విశాఖ వాసులకు గుడ్ న్యూస్ రైల్వే శాఖ చెప్పింది. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
విశాఖ వాసులకు గుడ్ న్యూస్ రైల్వే శాఖ చెప్పింది. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు వస్తుండటంతో రైల్వే జోనల్ కార్యాలయానికి సంబంధించి రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది. రైల్వే జోనల్ కార్యాలయంతో పాటు పరిపాలన భవనాలను నిర్మించేందుకు ఈ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వచ్చే నెల 27వ తేదీతో...
వచ్చే నెల 27వ తేదీతో టెండర్ల ప్రక్రియ ముగియనుంది. జీఎం కార్యాలయ భవనంతో పాటు పరిపాలన భవనాలను రెండేళ్లలో నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ కోసం భూములను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు వేగంగా అమలయ్యే అవకాశాలున్నాయి. నిజంగా విశాఖ వాసుల కలవేరే సమయం దగ్గరలోనే ఉంది.
Next Story