Thu Dec 26 2024 15:20:26 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం...ఆస్తి నష్టం ఎంతంటే?
విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో ఈ ప్రమాదం జరిగింది
విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక బోటులో సంభవించిన ప్రమాదంతో ఇతర బోట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అనేక బోట్లు ఈ ప్రమాదంలో అగ్ని కీలలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నలభై బోట్లకు పైగానే మంటలకు ఆహుతయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
40 బోట్లు తగలబడటంతో...
అయితే ఈ ప్రమాదంలో బోటులో ఉన్న వారి పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది. బోట్లలో నిద్రిస్తున్న వారి పరిస్థితి సమాచారం ఇంకా తెలియరావం లేదు. నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. బోట్లన్నీ కళ్ల ముందే కాలిపోతుండటంతో బోట్ల యజమానుల బాధలు వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఏదైనా నిప్పు అంటుకుని ఈ ప్రమాదం సంభవించిందా? లేదా మరెవరైనా కావాలని బోటుకు నిప్పంటించారా? అన్నది విచారణలో తెలియాల్సి ఉంది.
Next Story