Mon Mar 31 2025 14:27:28 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో విషాదం.. ప్రేమజంట బలవన్మరణం
విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట మరణించింది.

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట మృతి చెందింది. ఒక అపార్ట్ మెంట్ పై నుంచి దూకి మరణించారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుస్మితలుగా పోలీసులు గుర్తించారు. విశాఖ గాజువాక పోలీసుల కథకం ప్రకారం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలోని ఒక అపార్ట్ మెంట్ లో దుర్గారావు, సాయి సుస్మితలు ఉంటున్నారు.
సహజీవనం చేస్తూ...
వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమలాపురానికి చెందిన వీరిద్దరూ నిన్న తమ ఫ్లాట్ లో గొడవపడ్డారని అక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలిసింది. మద్యం బాటిల్స్ తో పాటు వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో వీరిద్దరూ మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story