Mon Dec 23 2024 06:27:13 GMT+0000 (Coordinated Universal Time)
ఇందిరా గాంధీ జూలో వరుస విషాదాలు
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలో మరో జీవి ప్రాణాలు కోల్పోయింది. వరుసగా రెండు రోజుల్లోనే
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలో మరో జీవి ప్రాణాలు కోల్పోయింది. వరుసగా రెండు రోజుల్లోనే రెండు పులులు చనిపోయాయి. రెండు రోజుల క్రితమే 22 సంవత్సరాల పెద్దపులి జానకి మృతి చెందింది. ఇంతలో అనారోగ్యంతో యానిమల్ రెస్క్యూ సెంటర్లో చికిత్స పొందుతున్న 23 సంవత్సరాల పెద్దపులి కుమారి మృతి చెందింది. 2007లో సర్కస్ గ్రూప్ నుంచి కుమారిని రక్షించారు. ప్రస్తుతం యానిమల్ రెస్క్యూ సెంటర్లో ఆవాసం పొందుతోంది. ఈ రెండు పులల మరణాన్ని అధికారులు స్వయంగా ప్రకటించారు.
జూలో మొత్తం మూడు పులులు ఉండేవని.. రెండు మరణించాయని జూ క్యూరేటర్ తెలిపారు. పులి సాధారణ జీవితకాలం 12-15 సంవత్సరాలని.. ఈ క్రమంలోనే వయోభారం, అనారోగ్యంతో కుమారి మృతి చెందిందని జూ అధికారులు వెల్లడించారు. వరుస జంతు మరణాలపై జూ అధికారులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పులులు చాలా ఏళ్లుగా జూలో ఉన్నాయి. విశాఖ జూ పార్కులో సుమారు 16 ఏళ్లుగా సందర్శకులను అలరిస్తున్నాయి. అలాంటి రెండు పెద్దపులులు రెండు రోజుల వ్యవధిలోనే చనిపోవడంతో జూ సిబ్బంది మాత్రమే కాకుండా జంతు ప్రేమికులు విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జిరాఫీ, పెద్దపులి మరణించాయి.
Next Story