వైజాగ్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్.. రైల్వే స్టేషన్లో సరికొత్త కోచ్ రెస్టారెంట్
విశాఖ ఒక పర్యటక ప్రదేశం. చాలా మంద టూరిస్టులు విశాఖ జిల్లాను తప్పకుండా సందర్శిస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన..
విశాఖ ఒక పర్యటక ప్రదేశం. చాలా మంద టూరిస్టులు విశాఖ జిల్లాను తప్పకుండా సందర్శిస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతత గల ప్రదేశం. ఇక్కడ అందమైన బీచ్ లు, అద్భుతమైన పార్క్ లు, పచ్చదనం పరచుకున్న ఎత్తైన తూర్పు కనుమలు, లాంటి ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు ఇక్కడి తినుబండారాలు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పరిమితమైన స్థానిక ఆహార రుచులు కూడా టూరిస్టులకు అంతే ప్రత్యేకంగా అనిపిస్తాయి. ప్రధానంగా విశాఖ లో లభించే సీ ఫుడ్‌కు భలే గిరాకీ. విశాఖ స్టార్ హోటల్స్ లో లభించే సీ ఫుడ్ ఆహారాన్ని పక్కన పెడితే విశాఖ స్థానిక హోటళ్లలో లభించే అథెంటిక్ ఫుడ్ కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అలాంటి విశాఖ అథెంటిక్ ఫుడ్ తినాలంటే ఇకపై విశాఖ నగర వీధుల్లో తిరగక్కర్లేదు. మీరు కానీ విశాఖ కు రైల్ లో వచ్చినా, లేదంటే ఏ రకంగా వచ్చినా ఒక్కసారి విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లారంటే చాలు మీకు ట్రైన్ కోచ్ లో నిర్వహిస్తున్న ఒక అందమైన రెస్టారెంట్ మనకు రుచికరమైన ఫుడ్ ను అందిస్తుంది. అరకు బొంగు చికెన్ నుంచి స్టఫడ్ క్రాబ్ వరకు మనకు ఆ విశాఖ కోచ్ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులొ 24 గంటలూ ఉంటాయి