Tue Apr 22 2025 10:43:11 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కాన్వాయ్ వల్ల ఎగ్జామ్ రాలేకపోయారన్న దానిపై కమిషనర్ ఏమన్నారంటే?
పవన్ కల్యాణ్ కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE ఎగ్జామ్ రాయలేకపోయారన్న ఆరోపణలపై విశాఖ పోలీసు కమిషనర్ బాగ్చి స్పష్టతనిచ్చారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE ఎగ్జామ్ రాయలేకపోయారన్న ఆరోపణలపై విశాఖ పోలీసు కమిషనర్ బాగ్చి స్పష్టతనిచ్చారు. పోలీసుల వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగలేదని ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్ వల్ల ఆలస్యం అయ్యిందన్న ఆరోపణల్లో నిజం లేదని కమిషనర్ తెలిపారు.
వారే ఆలస్యంగా వచ్చి...
తాము విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా తాము ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని కమిషనర్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, లేటుగా వచ్చిన విద్యార్థుల ఫోన్లను ట్రాక్ చేశామని ఆయన తెలిపారు. వాళ్లే లేటుగా వచ్చి పోలీసులపై నిందలేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇందులో పోలీసుల తప్పిదం ఏమీ లేదని ఆయన తెలిపారు.
Next Story