Fri Mar 14 2025 00:39:34 GMT+0000 (Coordinated Universal Time)
Medaram : నేడు మూడో రోజుకు చేరుకున్న మేడారం మినీ జాతర
మేడారం మినీ జాతర మూడో రోజుకు చేరుకుంది. వేల మంది భక్తుల వచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు

మేడారం మినీ జాతర మూడో రోజుకు చేరుకుంది. వేల మంది భక్తుల వచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు నేడు మంత్రి సీతక్క హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం మినీ జాతర సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనం...
మేడారం మినీ జాతర సందర్భంగా ఈరోజు ఆదివాసీల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తుండటంతో మేడారం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు.
Next Story