Sat Mar 29 2025 20:09:22 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాల దెబ్బకు మహబూబాబాద్ జిల్లా కూడా బాగా దెబ్బతినింది. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో ఈరోజు ఈ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించనున్నారు. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.
నిన్న ఖమ్మంలో...
నిన్న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఖమ్మం జిల్లాకు చేరిన రేవంత్ రెడ్డి అక్కడ వరద పరిస్థితులను సమీక్షించారు. బాధితులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. పంట నష్టం అంచనాలను రూపొందించాలని ఇప్పటికే అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాత్రి ఖమ్మంలోనే బస చేసిన రేవంత్ రెడ్డి నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
Next Story