నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను శోభిత పోస్టు చేసింది. నిశ్చితార్థం తర్వాత శోభిత ధూళిపాళ్ల చేసిన మొదటి పోస్టు ఇదే
శోభితా ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన అమ్మాయి. తండ్రి ధూళిపాళ్ల వేణుగోపాల్ రావు నేవీలో ఇంజినీర్ గా చేసేవారు. తల్లి శాంతారావు గవర్నమెంట్ టీచర్
శోభిత స్కూలింగ్ అంతా వైజాగ్ లోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లోనే గడిచింది. ఆ తర్వాత వాళ్ల నాన్నకు ముంబైకి ట్రాన్స్ ఫర్ అవడంతో పై చదువులు అక్కడే పూర్తి చేసింది
ముంబై యూనివర్సిటీ, హెచ్ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేశాక మోడలింగ్ కెరీర్ ను మొదలుపెట్టింది
2013లో ఫెమినా మిస్ డియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. 2016లో వచ్చిన రామన్ రాఘవన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది