ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం.. లిస్టులో హైదరాబాద్ కూడా!!

ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 10 ప్రధాన భారతీయ నగరాల్లో రోజువారీ మరణాలలో 7 శాతానికి పైగా మరణాలు వాయు కాలుష్యం ద్వారానే జరుగుతున్నాయి
అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసి వంటి నగరాల డేటాను అధ్యయనం విశ్లేషించింది
పీఎం2.5 స్థాయిలు, ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోకి లోతుగా చొచ్చుకుపోయే కాలుష్య కారకాలు ఈ మరణాలకు కారణం అవుతున్నాయి
PM2.5 కాలుష్య కారకాలుగా చెప్పుకునే క్యాన్సర్‌కు కారణమయ్యే మైక్రోపార్టికల్స్ స్థాయిలను పరిశీలించారు. 2008 నుండి 2019 వరకు ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లోని అధ్యయనం ప్రకారం నగరాల్లో నమోదైన మరణాలలో ఇది 7.2 శాతంగా ఉంటుందని అంచనా
వాయు కాలుష్యంతో ఏడాదికి 12,000 మరణాలు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంటున్నాయి. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశం. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో కూడా మరణాల రేటు ఎక్కువగా ఉంది
భారత వాయు నాణ్యతా ప్రమాణాలను కఠినతరం చేయాలని పరిశోధకులు సూచించారు. అధ్యయనం చేసిన నగరాల్లో అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న సిమ్లాలో కూడా మొత్తం మరణాలలో 3.7 శాతం కాలుష్యానికి సంబంధించినవే ఉన్నాయి
దేశంలో ప్రస్తుత సిఫార్సు క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల PM2.5, ఇది WHO మార్గదర్శకాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
రాబోయే రోజుల్లో గాలి కాలుష్యం మరింత తీవ్రతరమవ్వనుంది. అలాంటి పరిస్థితి వచ్చేదానికంటే ముందుగానే మేల్కొనడం అత్యుత్తమమని నిపుణులు సూచిస్తూ ఉన్నారు