గణేష్ చతుర్థిని చాలా గొప్పగా జరుపుకునే నగరాల్లో ముంబై ఒకటి. ఈ ఏడాది కూడా గణేష్ చతుర్థి సందడి ముంబైలో మొదలైంది
పలు ప్రాంతాల్లో బొజ్జ గణపయ్య విగ్రహ ప్రతిష్ట జరిగింది. ముంబైలోని GSB సేవా మండల్ 'అత్యంత ధనిక' గణపతి గా పేరు పొందారు. ఈ విగ్రహాన్ని 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరించారు.
ఈ విలువైన బంగారాన్ని, ఆభరణాలను కాపాడేందుకు, సేవా మండల్ రూ. 360.45 కోట్ల బీమా చేయించింది.
విగ్రహాన్ని ఏకంగా 66.5 కిలోల బంగారు, 295 కిలోలకు పైగా వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించారు. మండపానికి రికార్డు స్థాయిలో రూ.360.40 కోట్లకు బీమా చేయించినట్లు జీఎస్‌బీ సేవామండల్ నిర్వాహకులు తెలిపారు
మండల ప్రతినిధి మాట్లాడుతూ, "గణేష్ భక్తులందరికీ మేము సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ సంవత్సరం 69వ గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము." అని తెలిపారు.
నిర్వాహకులు రూ. 360.45 కోట్ల సమగ్ర బీమా పాలసీని తీసుకున్నారు. భద్రత పరంగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఫుట్‌ఫాల్‌ను పర్యవేక్షించడానికి హై-డెన్సిటీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేశారు
గతేడాది ఈ గణేశ్ మండపానికి రూ.316 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ పెంచేశారు. నిర్వాహకులు రూ. 360.45 కోట్ల బీమా పాలసీని తీసుకున్నారు
భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం, వచ్చే ఏడాది ప్రారంభోత్సవం పురస్కరించుకుని హోమం, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.