హ్యాపీ బర్త్ డే దళపతి విజయ్.. ఈ విషయాలు మీకు తెలుసా?

తమిళనాడులో స్టార్ హీరో అయిన దళపతి విజయ్.. త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు
ఫిబ్రవరి 2న, దళపతి విజయ్ తమిళనాడులో తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని.. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వనని విజయ్ ప్రకటించారు
2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని విజయ్ రాజకీయాల్లోకి దిగనున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నారు
అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ 1984 నుండి 1998 వరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఐదు చిత్రాలలో కనిపించాడు. అన్నీ అతని తండ్రి SA చంద్రశేఖర్ దర్శకత్వం వహించినవే
రజనీకాంత్ సినిమాలో విజయ్ కనిపించాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నాన్ శివప్పు మణితన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయ్ నటించాడు
విజయ్ పాపులారిటీ కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు. నటుడికి సమీప రాష్ట్రం కేరళలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు
విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. విజిల్, మాస్టర్, బీస్ట్, లియో సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి
విజయ్‌కి విద్య అనే సోదరి ఉండేది. ఆమె కేవలం రెండేళ్ల వయసులో మరణించింది. అతని ప్రొడక్షన్ హౌస్ వివి ప్రొడక్షన్స్ అంటే విద్యా-విజయ్ ప్రొడక్షన్స్ అని అర్థం. అందులో ఆమె పేరును ఉంచి తన అభిమానాన్ని చాటుకున్నాడు
2009 లో విజయ్ మక్కల్ ఇయక్కం అనే అభిమాన బృందాన్ని స్థాపించారు. ఇది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు అంకితం చేశారు. ఈ బృందం 2011 రాష్ట్ర ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమికి మద్దతు ఇచ్చింది