ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కంటే రెండు రెట్లెక్కువ ధర.. మూడు స్క్రీన్స్ తో ఫోన్!

Apple మొబైల్స్ కంటే ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను Huawei చైనా మార్కెట్ లోకి వదిలింది
చాలా మంది హువాయ్ స్మార్ట్ ఫోన్ అభిమానులు ధర చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు
iPhone 16 Pro Max ధర కంటే రెండు రెట్లు ఎక్కువగా 2,800 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు
అయినా కూడా హువాయ్ ట్రై-ఫోల్డబుల్ మేట్ XTని కొనడానికి క్యూ కట్టారు
అయితే ముందస్తు ఆర్డర్‌లు ధృవీకరించిన తర్వాత మాత్రమే హువాయ్ ట్రై-ఫోల్డబుల్ మేట్ XTని కొనుగోలు చేయగలరని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు
హువాయ్ ట్రై-ఫోల్డబుల్ మేట్ XT కోసం ప్రీ-ఆర్డర్‌లు 6.5 మిలియన్లను అధిగమించాయి. ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్ విషయంలో ఇదో కొత్త సంచలనం అనే చెప్పొచ్చు
Huawei సంస్థ ప్రపంచంలో తొలి ట్రిపుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది
Huawei Mate XT స్మార్ట్‌ఫోన్‌లో మూడు స్క్రీన్ లు ఉంటాయి. అవి పూర్తిగా తెరిచినప్పుడు టాబ్లెట్ లాగా కనిపిస్తాయి
6.4-అంగుళాల ఫ్రంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది, పూర్తిగా తెరిచినప్పుడు డిస్‌ప్లే పరిమాణం 10.2-అంగుళాలకు పెరుగుతుంది
మేట్ XT ప్రస్తుతం చైనాలో విడుదలైంది. ధరలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. చైనాలో, ట్రిపుల్ ఫోల్డ్ డివైజ్ ప్రారంభ ధర 19,999 యువాన్ (సుమారు రూ. 2,35,000) గా ఉంది.