అదిరిపోయిన కెమిస్ట్రీ.. బీచ్ లో ఎన్టీఆర్, జాన్వీ జంట అదుర్స్
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'దేవర' సినిమా కోసం టాలీవుడ్ మాత్రమే కాదు.. దేశంలోని సినీ అభిమానులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇప్పటికే ఫియర్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో సింగిల్ 'చుట్టమల్లె' యూట్యూబ్‌లో విడుదలైంది.
అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ పాటను శిల్పా రావు ఆలపించారు
ఎన్టీఆర్ స్టైలింగ్, లుక్.. జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ ఈ సాంగ్ లో ప్లస్ అయ్యాయి. విజువల్స్ కూడా బాగున్నాయి
ఎన్టీఆర్, జాన్వీల జంట తెరపై చాలా బాగుంది. పాట ఖచ్చితంగా రిపీట్ మోడ్ లో చూస్తారు
అంతకుముందు.. దేవర మేకర్స్ ఈ చిత్రం రెండవ సింగిల్ విడుదల తేదీని ప్రకటిస్తూ.. ఆగస్ట్ 2, శుక్రవారం కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇప్పుడు సాంగ్ విడుదలైన గంటల్లోనే కొన్ని మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది
అనిరుధ్ పై అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతను వారి అంచనాలను అందుకుంటున్నాడు
దేవర మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల కానుంది
ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతూ ఉంది. పాన్ ఇండియా సినిమాగా కూడా విడుదల అవుతోంది.