మొహర్రం అంటే పండుగ రోజు కాదు. ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం.

14 శతాబ్దాల క్రితమే మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్నే ‘మొహరం’గా పేర్కొంటారు. మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. ఇది కూడా ముస్లింలకు మరొక పవిత్ర మాసం
మొహర్రం మొదటి రోజును ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా అల్ హిజ్రీ లేదా అరబిక్ న్యూ ఇయర్ అని పిలుస్తారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు ఈ సమయంలో వలస వచ్చినందున ఈ నెల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది
1400 ఏళ్ల క్రితం హిజ్రీశకం 60 లో జరిగిన యదార్ధ ఘటనకు ప్రతి రూపం మొహర్రం. మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్యఖురానుగా గ్రంథస్తం చేశారు. ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అడుగు జాడల్లో విస్తరించింది
ఈ నేపధ్యంలో అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ వ్యతిరేకిస్తారు
దీంతో ఆయన కుటుంబ సభ్యులు 72 మంది యుద్ధంలో నిలుస్తారు. ఇహ లోకం కంటే పరలోకమే మేలని ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ఎట్టి పరిస్థితిల్లోనూ ఇస్లాం సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉండేది లేదని స్పష్టం చేసారు
అత్యంత హేయంగా ఇమామ్ హుస్సేన్ కుటుంబసభ్యులను శత్రు సైన్యం ఇరాక్ లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు. రెండేళ్ళ చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు
మొహారం నెల 10 వరోజు హాజరత్ ఇమాం హుసైన్ సైతం వీర మరణం పొందారు. ఇస్లాం కోసం కుటుంబం బలిదానం కోసం సిద్ధమవ్వడం నిజంగా గొప్ప విషయమని తేలిపోయింది
అందుకే మొహారం పండుగ కాదు. మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాల్ని స్మరించడం. చాలా ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది