ముగిసిన పారిస్ ఒలింపిక్స్.. నెక్స్ట్ ఎక్కడంటే?

పారిస్ ఒలింపిక్ గేమ్స్ ముగిశాయి. ఒలింపిక్ జెండాను లాస్ ఏంజిల్స్‌కు అందించారు. 2028లో ఒలింపిక్స్ అమెరికా నగరంలోనే జరగనున్నాయి
ప్రముఖ సింగర్స్ బిల్లీ ఎలిష్, రెడ్ హాట్ చిలీ పెప్పర్స్, స్నూప్ డాగ్ ఆదివారం వేల మంది అభిమానుల కోసం పారిస్ ఒలింపిక్స్ క్లోజింగ్ సెరిమనీలో ప్రదర్శన ఇచ్చారు
IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్, అథ్లెట్లు, ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మార్చాండ్‌తో కలిసి 33వ సమ్మర్ గేమ్స్ ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు
COVID-19 మహమ్మారి కారణంగా 2021 టోక్యో గేమ్స్‌ ఆలస్యం అవ్వడమే కాకుండా.. అభిమానులు లేకుండానే నిర్వహించారు. అయితే పారిస్ లో మాత్రం 70,000 మంది ప్రేక్షకుల మధ్యన ముగింపు వేడుకలను నిర్వహించారు
సాంప్రదాయం ప్రకారం, 1896లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాన్ని గౌరవిస్తూ గ్రీస్ జాతీయ గీతాన్ని మొదట ప్లే చేశారు
ఒలింపిక్ క్రీడల ముగింపు కార్యక్రమంలో స్టార్ షూటర్ మను భాకర్‌తో కలిసి హాకీ లెజెండ్ PR శ్రీజేష్ భారత బృందం జెండాను మోశారు
జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా హాకీ లెజెండ్ శ్రీజేష్‌ భారత పతకాన్ని మోయడాన్ని చూడాలని తన కోరికను వ్యక్తం చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (IOA) చీఫ్, PT ఉష వెల్లడించారు
ఒలింపిక్ జెండాను అందజేయడంతో కార్యక్రమం ముగిసింది. పారిస్ మేయర్ అన్నే హిడాల్గో 2028లో 34వ సమ్మర్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్‌కు జెండాను అందించారు
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ కరెన్ బాస్ నుండి ఒలింపిక్ పతాకాన్ని స్వీకరించి లాస్ ఏంజిల్స్‌కు తీసుకెళ్లారు
రెండు వారాల పాటూ సాగిన ఒలింపిక్స్ పోరులో చివరి ఈవెంట్ వరకు చైనా, యునైటెడ్ స్టేట్స్ పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం పోరాడాయి